కేంద్ర మంత్రి రవ్‌నీత్‌సింగ్ బిట్టు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని ఉద్దేశించి కేంద్రమం త్రి, బీజేపీ నేత రవ్‌నీత్‌సింగ్ బిట్టు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో నంబర్ వన్ ఉగ్రవాది రాహుల్‌నేనని అన్నారు. రాహుల్ అసలు భారతీయుడే కాదని విమర్శించారు. ఆదివారం మాట్లాడుతూ.. దేశాని కి అతిపెద్ద శత్రువు రాహుల్ అని ఆరోపించారు. ‘గతంలో ఆయన ముస్లింలను వాడు కోవాలని చూశారు. అది సాధ్యం కాలేదు. ఇప్పుడు సిక్కుల్లో చీలిక తేవాలని కుట్ర చేస్తున్నారు. గతంలో మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాదులే ఇటీవల రాహుల్ మాదిరి ప్రకటనలు చేసేవారు.
ఆయన మాటలను ఉగ్రవాదులు కూడా ప్రశంసిస్తున్నారు. వాళ్లు సమర్థ్ధిస్తున్నారంటే రాహుల్‌గాంధీ దేశంలోనే నంబర్ వన్ ఉగ్రవాది అన్నమాటే. రాహుల్‌గాంధీ మీద రివార్డు ప్రకటించాలి’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత అయిన రవ్‌నీత్ గత లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీలో చేరి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. ‘చూడండీ.. నా ఉద్దేశంలో రాహుల్‌గాంధీ అసలు భారతీయుడే కాదు. ఆయన ఎక్కువ కాలం విదేశాల్లోనే గడిపారు. ఆయన కుటుంబం, స్నేహితులు కూడా విదేశాల్లోనే ఉన్నారు. దేశాన్ని ప్రేమించటంలేదు కాబట్టే తరుచూ విదేశాలకు వెళ్లి భారత్‌కు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారు’ అని బిట్టు విమర్శించారు.