- రాజీవ్‌గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో పలువురితో భేటీ
- 400 మందితో గంటపాటు ముఖాముఖీ
- కులగణనపై అభిప్రాయాలు తీసుకోనున్న అగ్రనేత
- దేశమంతా ప్రచార అస్త్రంగా మల్చుకునేలా ప్లాన్
- పార్లమెంట్‌లో బీజేపీపై ఒత్తిడి పెంచే అవకాశం
హైదరాబాద్, నవంబర్ 4 (విజయక్రాం తి): కులగణనపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాలు, ప్రజలు జరిగే మేలు వంటి అంశాలపై ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ అధ్యయనం చేయనున్నారు. ఇందుకోసం మంగళవారం రాష్ట్రానికి రాహుల్‌గాంధీ రానున్నారు.
సాయంత్రం 5:30 నుంచి 6: 30 గంటల వరకు దాదాపు 400 మందితో బోయినపల్లిలోని రాజీవ్‌గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో మేధావులు, ప్రొఫెసర్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన నాయకులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. వీరి నుంచి కులగణనకు సంబంధించిన అంశాలపై ఫీడ్ బ్యాక్‌ను తీసుకోనున్నారు.
కులగణనతో కలిగే లాభాలు, ప్రస్తుతం ఉన్న సమస్యలు, ఇలా అన్నింటిని ఒక నివేదిక రూపంలో రాహుల్‌గాంధీ తీసుకోనున్నారని పార్టీ వర్గా లు చెబుతున్నాయి. తద్వారా దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావచ్చని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.
కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో సానుకూలత రాకుంటే పార్లమెంట్‌లో బీజేపీ నిలదీయాలని ఏఐసీసీ పకడ్బందీగా ప్లాన్ చేస్తున్న ట్లుగా, అందుకు వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల మద్దతును కోరుతున్నట్లుగా సమాచారం.
తెలంగాణలో తీసుకున్న ఈ నిర్ణ యం దేశ వ్యాప్తంగా కారణమవుతుందని, కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు ఒక అస్త్రంగా వినియోగించుకోవడానికి అవకా శం ఉంటుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.
తెలంగాణలో అమలు చేయనున్న కులగణనను దేశ వ్యాప్తంగా ఒక ఆయుధం గా వాడుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోం ది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే.. కులగణన చేస్తామని భారత్ జోడో యాత్ర లో భాగంగా రాహుల్‌గాంధీ హామీ ఇచ్చా రు. హైకమాండ్ సూచనతో కులగణనకు తెలంగాణ మొదటగా సిద్ధమవుతోంది.
6 నుంచి కులగణన..
ఈ నెల 6 నుంచి కులగణన సర్వే రాష్ట్రంలో మొదలు కానున్నది. కులగణనపై రాష్ట్ర బీసీ కమిషన్‌కు బదులు ప్రత్యేక కమిషన్ వేయాలని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం కూ డా స్పందించింది. కులగణనకు న్యాయపరమైన చిక్కులు రాకుండా హైకోర్టు తీర్పు మేరకు ప్రభుత్వం డెడికేట్ కమిషన్ నియమిస్తుందని వెల్లడించింది.
కులగణనకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉం దని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెంచుతామని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఇక రాష్ట్ర బీసీ కమిషన్ కూడా కొన్ని జిల్లాలో సమావేశాలు నిర్వహించింది. కాంగ్రెస్ పార్టీ కూడా డీసీసీ అధ్యక్షుల నేతృత్వంలో 33 జిల్లాలలో పార్టీ నేతలు, మేధావులు, వివిధ కులసంఘాల నుంచి అభిప్రాయ సేకరణ కూడా చేపట్టారు.
సమావేశాల్లో వచ్చిన అభిప్రాయాలను కూడా రాహుల్‌గాంధీకి నివేదిక రూపంలో ఇవ్వను న్నారు. దీంతో కులగణనపై రాష్ట్ర ప్రభు త్వం తీసుకున్న నిర్ణయం ప్రజల్లోకి వెళ్లడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రాహుల్‌గాంధీ షెడ్యూల్..
* సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరిక
* బేగంపేట నుంచి బోయినపల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌కు
* సాయంత్రం 5:30 గంటల నుంచి 6:30 గంటల వరకు మేధావులతో భేటీ
* గంట పాటు కుల గణనపై అభిప్రాయాలు అడిగి తెలుసుకోనున్న రాహుల్
* కులగణన ద్వారా జరిగే లాభాలను వివరించనున్న రాహుల్ గాంధీ
* రాత్రి 7:10 గంటలకు తిరిగి ఢిల్లీకి వెళ్లనున్న రాహుల్‌గాంధీ