calender_icon.png 27 November, 2024 | 4:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అదానీని ఎందుకు అరెస్ట్ చేయరు..?

27-11-2024 02:23:54 PM

న్యూఢిల్లీ,(విజయక్రాంతి): అదానీ గ్రూప్‌కు సంబంధించిన లంచం ఆరోపణలతో సహా పలు అంశాలపై చర్చకు కేంద్రం నిరాకరించడంపై ప్రతిపక్షాల భారీ నిరసనల మధ్య లోక్‌సభ, రాజ్యసభ రెండూ మరోసారి వాయిదా పడ్డాయి. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. అవినీతి ఆరోపణలను అదానీ అంగీకరిస్తారని అనుకుంటున్నారా..?, చిన్న చిన్న ఆరోపణలతో వందల మందిని అరెస్టు చేస్తున్నారని, వేల కోట్ల అవినీతి ఆరోపణలున్న అదానీని మాత్రం అరెస్టు ఎందుకు చేయరు..? అని రాహుల్ ప్రశ్నించారు. జైలులో ఉండాల్సిన అదానీని మోదీ ప్రభుత్వం కాపాడుతోందని ఆరోపించారు. అదానీ అంశంపై సభలో చర్చించాలని విపక్ష సభ్యులు పట్టుబట్టడంతో స్పీకర్ ఉభయసభలను రేపటికి వాయిదా వేశారు.