రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో కాంగ్రెస్ నేత వైఖరిపై బీజేపీ విమర్శలు
న్యూఢిల్లీ, నవంబర్ 26: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అగౌరవపర్చారని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. గిరిజన కుటుంబం నుంచి వచ్చిన ముర్ము పట్ల కాంగ్రెస్ మొదటి నుంచీ ఇలాంటి వైఖరినే అవలంభిస్తోందని ఆరోపించింది. రాజ్యాంగ దినోత్సవం వేడుకల సందర్భంగా ముర్ముకు నమస్కరించకుండానే రాహుల్ వేదిక దిగి వెళ్లిపోయారని ఆరోపించింది.
రాష్ట్రపతి సహా మిగిలిన ప్రముఖులు నిలబడి ఉండగానే ఆయన కూర్చునే ప్రయత్నం చేశారని విమర్శించింది. జాతీయ గీతాలాపన సందర్భంగా రాహుల్ పక్క చూపులు చూశారని దుయ్యబట్టింది. వేడుకల సందర్భంగా రాహుల్ వ్యవహరించిన తీరుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.