న్యూఢిల్లీ: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారాం మృతిపట్ల కాంగ్రెస్ ఆగ్రనేత రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ... సీతారాం మరణం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని, దేశంపై లోతైన అవగాహన ఉన్న గొప్ప నేత అని కొనియాడారు. ఏచూరి తనకు మంచి స్నేహితుడు, ఆప్తుడని తెలిపారు. ఊపిరితిత్తుల సమస్యలతో సీతారాం బాధపడుతూ గత నెల 19న ఢిల్లీ ఎయిమ్స్ లో చేరారు. గురువారం చికిత్స పొందుతూ ఏచూరి తుదిశ్వాస విడిచారు.