calender_icon.png 23 February, 2025 | 6:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసిన రాహుల్ గాంధీ

23-02-2025 12:32:37 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): శ్రీశైలం ఎడమ గట్టు ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం(Srisailam Left Bank SLBC Tunnel Route)లో జరిగిన ప్రమాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Congress Leader Rahul Gandhi) 20 నిమిషాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy)తో మాట్లాడారు. బాధితులను రక్షించేందుకు జరుగుతున్న చర్యలపై ఆరా తీశారు. ఘటన జరిగిన వెంటనే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Irrigation Minister Uttam Kumar Reddy),  ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలానికి వెళ్లారని సీఎం తెలిపారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నట్లు రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి వివరించారు.

ఎస్ఎల్బీసీ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను అభినందించిన రాహుల్ ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అన్ని ప్రయత్నాలూ చేయాలని రేవంత్ రెడ్డికి సూచించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ లో చిక్కుకున్న వారిని కపాడేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ సహాయక చర్యల్లో 24 మందితో కూడిన ఆర్మీ బృందం, 130 మంది ఎన్డీఆర్ఎఫ్, 120 మంది ఎస్డీఆర్ఎఫ్, 24 మంది హైడ్రా బృందం, 24 మందితో కూడిన సింగరేణి కాలరీస్ రెస్క్యూ టీమ్ పాల్గొన్నారు. ఘటనాస్థలంలో కూలిన మట్టి, నీటితో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు వెల్లడించారు.