న్యూఢిల్లీ: లోక్ సభ పీఏసీ కమిటీలో ముగ్గురు తెలుగువారికి అవకాశం లభించింది. 15 మంది సభ్యులతో 18వ లోక్ సభ ప్రజాపద్దుల కమిటీ ఏర్పడింది. పీఏసీ ఛైర్మన్ గా లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎన్నికయ్యారు. పీఏసీ కమిటీలో సభ్యత్వం కోసం 19 మంది అభ్యర్థులు పోటీపడ్దారు. నలుగురు సభ్యులు పోటీ నుంచి తప్పుకోవడంతో ఎన్నిక ఏకగ్రీవం అయింది. 2025 ఏప్రిల్ 30తో ప్రజాపద్దుల కమిటీ సభ్యుల కాలపరిమితి ముగియనుంది. బాలశౌరి, మాగుంట, సీ.ఎం. రమేష్ పీఏసీ సభ్యులుగా అవకాశం దొరికింది.