09-04-2025 06:41:45 PM
అహ్మదాబాద్,(విజయక్రాంతి): చనిపోయాక నా గురించి ప్రజలు ఏం ఆలోచిస్తారనేది అనవసరం అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. అహ్మదాబాద్ లో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. తెలంగాణలో కులగణన పూర్తి చేశామని, దేశ సమస్యలు తీర్చాలంటే దేశాన్ని ఎక్స్ రే తీయాల్సిందే అన్నారు. దళితలు, ఆదివాసీల సమస్యలపై దృష్టి పెట్టాలని, దళితలు, ఆదివాసీలకు న్యాయం జరుగుతోందా అన్న ప్రశ్న తలెత్తుతోందన్నారు. దళితలు, ఆదివాసీల సమస్యల పరిష్కారానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదని ఆరోపించారు. తను అనుకున్న పనులు పూర్తి చేశాక ప్రజలు మరిచిపోయినా తనకు అభ్యంతరం లేదని, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల పెంచుతూ బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపితే చర్యలు తీసుకోవట్లేదని రాహుల్ గాంధీ మండిపడ్డారు. తెలంగాణలో కులగణను విజయవంతంగా నిర్వహించామని, కులగణన ఆధారంగానే రిజర్వేషన్లు పెంచే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. కులగణన వల్ల దేశంలో బీసీల సంఖ్య ఎంతో తెలుస్తుందని, కులగణన విషయంలో తెలంగాణ దేశానికి మార్గం చూపిందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి అంశాన్ని తొలగిస్తామని, తెలంగాణలో 90 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలే ఉన్నారు. తెలంగాణ సంపదలో మాత్రం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు తగిన భాగస్వామ్యం లేదని, వారి జనాభాకు అనుగుణంగా సంపదలోనూ భాగస్వామ్యం అవసరమన్నారు. ప్రభుత్వరంగం సంస్థలను మోదీ ఒక్కొక్కటిగా విక్రయిస్తూ అదానీ, అంబానీలకి అప్పగిస్తున్నారని చెప్పుకోచ్చారు. ఎయిర్ పోర్టులు, గనులు, సిమెంట్, స్టీల్ సహా కీలక పరిశ్రమలన్ని అదానీకే అప్పగిస్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ అక్రమాల ద్వారా గెలిచిందని, మహారాష్ట్ర ఓటర్ల జాబితాను ఎన్నిసార్లు అడిగినా ఇప్పటివరకు ఇవ్వలేదని రాహుల్ గాంధీ విమర్శించారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ రోజూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూనే ఉన్నాయని, దేశంలో కులగణన చేపట్టాలని మోదీని కోరితే.. మోదీ, ఆర్ఎస్ఎస్ కులగణనను తిరస్కరించారని చెప్పారు. క్రైస్తవుల ఆస్తులు స్వాధీనం చేసుకోవాలని ఆర్ఎస్ఎస్ పత్రిక ఆర్గనైజర్ లో రాస్తున్నారని, లౌకిక భవనకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం ఉందని వ్యాఖ్యానించారు. దళితుడైన రాజస్థాన్ పీసీసీ నేతను ఆలయానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. వక్ఫ్ సవరణ చట్టం మత స్వేచ్ఛపై దాడి అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.