calender_icon.png 20 September, 2024 | 2:48 AM

ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ప్రధాని మోడీ పాలన

19-09-2024 07:24:38 PM

- గొప్ప ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్

- విదేశీ ఏజెంట్ గా వ్యవహరిస్తున్న రాహుల్ గాంధీ

- వంద రోజుల్లోనే... రూ 15 లక్షల కోట్లతో వివిధ అభివృద్ధి పనులు

- బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ధరo గురవారెడ్డి

గజ్వేల్,(విజయ క్రాంతి): ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ప్రధానమంత్రి మోడీ పాలన కొనసాగుతుందని, దేశంలో చేపడుతున్న ఆర్థిక సంస్కరణల విజయవంతంతో గొప్ప ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నట్లు బిజెపి రాష్ట్ర మీడియా విభాగం ప్యానలిస్టు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి దరం గురవారెడ్డి అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని బిజెపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వాలకు భిన్నంగా ప్రధాని నరేంద్ర మోడీ అవినీతి, అక్రమాలకు అవకాశం కల్పించకుండా మూడోసారి అధికారం చేపట్టిన కేవలం 100 రోజుల్లోనే రూ 15 లక్షల కోట్ల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు స్పష్టం చేశారు.

అలాగే మూడోసారి అధికారం చేపట్టి ప్రపంచ దేశాల్లో ప్రధాని మోడీ అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా గుర్తింపు పొందినట్లు చెప్పారు. రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగుల అభ్యున్నతికి ప్రాధాన్యతనిస్తూ ప్రగతి రథచక్రాలను పరుగులు పెట్టిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా 11లక్షల మంది మహిళలకు లక్పతి దివిస్, రూ 2 లక్షల 50 వేల కోట్ల వ్యయంతో రైతులకు ఆర్థిక అభివృద్ధి, 20వేల కోట్లతో కిసాన్ సమ్మతి పథకాలతోపాటు మేకింగ్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా లకు ప్రాధాన్యతనిస్తూ దేశంలోని 65 శాతం యువత, నిరుద్యోగులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు. అంతేగాకుండా 8 రైల్వేస్టేషన్ల నిర్మాణం, వందే భారత్ రైల్ ల ప్రారంభం, ఎయిర్ పోర్టులు, రోడ్డు, రైల్వేల అభ్యున్నతికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు.

రింగ్ రోడ్డు ఏర్పాటుతో ఉత్తర తెలంగాణ అభివృద్ధి సాధించనుండగా, రూ 22 వేల కోట్లతో 8 పారిశ్రామిక వాడల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు చోటు చేసుకోగా, మూడోసారి అధికారం చేపట్టిన దాఖలాలు లేవని ఎద్దేవా చేశారు. అలాగే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పరిపక్వత లేని వ్యాఖ్యలు చేస్తూ ప్రపంచ దేశాల్లో భారత దేశ పరువును మంట గలుపుతుండగా, పద్ధతి మార్చుకొని పక్షంలో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని వివరించారు. రాహుల్ గాంధీ విదేశాలకు ఏజెంట్ లాగా మాట్లాడుతున్నారన్నారు ఈ కార్యక్రమంలో నేతలు మాదాడి జశ్వంత్ రెడ్డి, వెంకటరమణ, ప్రముఖ న్యాయవాది రమణ, బిజెపి గజ్వెల్ పట్టణ పార్టీ అధ్యక్షులు మనోహర్ యాదవ్, బిజెపి నాయకులు నాయిని సందీప్, అయిల మహేందర్, మాడ్గురి నర్సింహా, బార్ అరవింద్  తదితరులు పాల్గొన్నారు.