calender_icon.png 25 January, 2025 | 5:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉగ్ర సంస్థలతో రాహుల్ దోస్తీ

03-07-2024 01:19:40 AM

  1. హిందువులు మెజారిటీగా ఉన్నన్ని రోజులే ప్రజాస్వామ్యం 
  2. దేశ ప్రజలకు రాహుల్ క్షమాపణ చెప్పాలి
  3. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి

హైదరాబాద్, జూలై ౨ (విజయక్రాంతి): రాహుల్‌గాంధీ మిడిమిడి జ్ఞానంతో హిందువులపై విద్వేషపూరితంగా వ్యాఖ్యలు చేస్తూ ఉగ్రవాద సంస్థలతో దోస్తీ చేస్తున్నారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి విమర్శించారు. హిందువులను కించప రిచేలా రాహుల్ చేసిన వ్యాఖ్యలు దురదష్టకరమని అన్నారు. హిందువులు మెజారిటీగా ఉన్నన్ని రోజులే దేశంలో ప్రజాస్వామ్యం, సామరస్యపూర్వక వాతావరణం ఉంటుందని వ్యాఖ్యానించారు. 

దేశ ప్రజలకు రాహు ల్ బహిరంగ క్షమాపణలు  చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్‌ను కిషన్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గనుల శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాల్లోని 645 జిల్లాల్లో డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ (డీఎంఎఫ్) ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రధాని ఆదేశాలతో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అన్ని వర్గాల ప్రజలకు బొగ్గు, ఇతర ఖనిజాల గనుల సీఎస్‌ఆర్ కార్యక్రమంలో భాగంగా ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

దేశవ్యాప్తంగా డీఎంఎఫ్ ఆధ్వర్యంలో రూ.92 వేల కోట్లకు పైగా నిధులున్నాయని పేర్కొన్నారు. రూ.50,900 కోట్లను వెచ్చించి 3,29,945 ప్రాజెక్టులు చేపట్టామని వివరించారు. ఇందులో 1,88,642 ప్రాజెక్టులు పూర్తయ్యాయని తెలిపారు. స్వయం సహాయక బృందాల మహిళలను లఖ్‌పతి దీదీలుగా మార్చే లక్ష్యంతో ప్రధాని పనిచేస్తున్నారని, ఇందులోభాగంగా డీఎంఎఫ్ నిధుల ద్వారా స్వయం సహాయక బృందాలను ప్రోత్సహిస్తున్నట్టు కిషన్‌రెడ్డి తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు సరైన ప్రాధాన్యతనిస్తూ.. అభివద్ధిని ముందుకు తీసుకెళ్లడం తమ ప్రధాన లక్ష్యంగా కిషన్‌రెడ్డి స్పష్టంచేశారు. కార్యక్రమంలో సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబే తదితరులు పాల్గొన్నారు. 

బొగ్గు గని ప్రాంత యువతకు కేంద్రం వరం నిర్మాణ్

బొగ్గు గనులున్న జిల్లాలకు చెంది సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్న యువతకు అండగా నిలిచేందుకు కేంద్రం ముందుకొచ్చింది. ప్రధాని మోదీ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘మిషన్ కర్మయోగి’ పథకానికి అనుగుణంగా వివిధ బొగ్గు సంస్థల సీఎస్‌ఆర్ నిధులతో యూపీఎస్‌సి పరీక్షల్లో ప్రిలిమినరీ రౌండ్‌లో క్వాలిఫై అయిన వారిని ప్రోత్సహించి, మెయిన్స్, ఇంటర్వ్యూ పరీక్షలకు సిద్ధం చేసే దిశగా నిర్మాణ్ (నోబుల్ ఇనిషియేటివ్ ఫర్ రివార్డింగ్ మెయిన్స్ ఆస్పిరెంట్స్ ఆఫ్ నేషనల్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్) కార్యక్రమానికి రూపకల్పన చేసినట్టు వచ్చిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి తెలిపారు.