మెల్‌బోర్న్: ఫామ్ లేమితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఆస్ట్రేలియాొోఏ తో జరుగుతున్న అనధికారిక టెస్టులో విఫలమయ్యాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన రాహుల్ 4 పరుగులకే పెవిలియన్ చేరాడు. అభిమన్యు ఈశ్వరన్ డకౌటయ్యాడు.
ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (16) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఆసీస్ బౌలర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 161 పరుగులకే కుప్పకూలింది. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ (80) అర్ధ సెంచరీతో రాణించడంతో భారత్ పరువు దక్కింది.ఆస్ట్రేలియా బౌలర్లలో నెసర్ 4, వెబ్‌స్టర్ 3 వికెట్లతో చెలరేగారు. రోజు ముగిసే సరికి ఆసీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది.