టీ20 ప్రపంచకప్ అనంతరం హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియనుంది. అతను కొనసాగుతాడా లేక కొత్త కోచ్ ఎవరైనా వస్తారా అన్న ప్రశ్నకు జైషా బదులిచ్చాడు. ‘ఈ విషయాన్ని పరిశీలిస్తున్నాం. వాస్తవానికి రాహుల్ పదవీ కాలం జూన్ వరకే ఉంది. ఒకవేళ అతడు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే.. చేసుకోవచ్చు. కోచ్ భారత్ నుంచి ఉంటారా? విదేశీయుడా అనేది ఇప్పుడే చెప్పలేం. అది క్రికెట్ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయంపై ఆధారపడి ఉంది. మూడు ఫార్మాట్లకు వేర్వేరు కోచ్‌లను నియమిస్తారా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. వీటిపై సీఏసీ త్వరలో ఒక నిర్ణయానికి వస్తుంది. రోహిత్, కోహ్లీ, బుమ్రా, జడేజా లాంటి చాలా మంది క్రికెటర్లు మూడు ఫార్మాట్లలో ఆడుతున్నారు. ఆటగాళ్లకు అనుగుణంగానే కోచ్ ఎంపిక ఉంటుంది’ అని పేర్కొన్నాడు.