calender_icon.png 9 February, 2025 | 4:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాహుల్.. అభినందనలు

09-02-2025 01:37:57 AM

  • ఢిల్లీలో బీజేపీని దగ్గరుండి గెలిపించారు
  • కాంగ్రెస్ అగ్రనేతపై కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు

హైదరాబాద్, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రికార్డు విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో హస్తిన అసెంబ్లీ ఫలితాలపై శనివారం ఎక్స్ వేదికగా స్పందించిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై వ్యంగ్యాస్త్రాలు సం ధించారు.

‘కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి అభినందనలు. బీజేపీని మరోసారి దగ్గరుండి గెలిపించారు’ అని పోస్ట్ చేశారు. దీంతో కేటీఆర్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తాజా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేదు. వరుసగా మూడు ఎన్నికల్లో ఆ పార్టీ ప్రభావం చూపలేదు. ఈ ఎన్నికల్లోనూ ఆ పార్టీ సున్నాకే పరిమితమైంది.