calender_icon.png 25 September, 2024 | 6:06 AM

మోదీపై రాహుల్ వ్యాఖ్యలు అర్థరహితం

25-09-2024 03:51:26 AM

దేశ వ్యతిరేక శక్తులతో దోస్తీ చేయడమే ఆయన విధానం

కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): కశ్మీర్ ఎన్నికల ప్రచారంలో భాగం గా ప్రధానమంత్రి మోదీపై రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ప్రధాని మోదీలో ఆత్మవిశ్వాసం తగ్గిందని, అందుకు తామే కారణమని రాహుల్‌గాంధీ పేర్కొనడం హాస్యాస్పదమన్నారు.

మోదీపై 140 కోట్ల మంది ప్రజల విశ్వాసం ఉందని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్ల మెంటును, స్పీకర్ వ్యవస్థను, సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగబద్ధ సంస్థలను అగౌరవపరచడం, ఇండియన్ ఆర్మీ లాంటి సున్నితమైన వ్యవస్థపై ప్రశ్నలను లేవనెత్తడం, దేశ వ్యతిరేక శక్తులతో దోస్తీ చేయడంతో సమానమని విమర్శించారు.

ఓట్లకోసం కులాలు, మతాల మధ్య విభేదాలు సృష్టించడం, దేశ ప్రధానిపై, కేంద్ర ప్రభుత్వంపై ఆధారరహిత విమర్శలు చేయ డం.. రాహుల్‌కు నిత్యకృత్యమైందని ధ్వజమెత్తారు. దేశంలోనే కాకుండా ప్రపంచమం తా మోదీపై విశ్వాసం ఉందని, ఉక్రెయిన్- రష్యా యుద్ధాన్ని ఆపి.. భారతీయులను మన దేశానికి భద్రంగా తీసుకొచ్చే సాహ సం, విశ్వాసం, ధైర్యం, శక్తి ఒక్క మోదీకే సాధ్యమని ప్రపంచమంతా కొనియాడిందని గుర్తుచేశారు.

ఇటీవలే క్వాడ్ సమావేశంలో అమెరికా జాతీయ భద్రతా సంస్థ.. భారతీ య కంపెనీలు ఉత్పత్తి చేయనున్న చిప్‌లపై సంపూర్ణ నమ్మకాన్ని వ్యక్తం చేయడమే.. మోదీపై యావత్ ప్రపంచానికి ఉన్న గౌరవానికి, విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. రాహుల్ గాంధీకి దేశ ప్రజలే సరైన బుద్ధి చెబుతారని తెలిపారు. నిస్వార్థంగా పనిచేస్తు న్న మోదీ మీద విమర్శలు చేసే నైతిక హక్కు రాహుల్ గాంధీకి లేదని అన్నారు.