ఉత్తర్వులు జారీచేసిన జీఏడీ
హైదరాబాద్, జనవరి 7 (విజయక్రాంతి): నీటి పారుదలశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాకు ప్రిన్సి పల్ సెక్రటరీగా పదోన్నతి లభించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జీఏడీ జారీచేసింది. ఈ పదోన్నతి జనవరి ఒకటి నుంచి అమల్లోకి వస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
2000 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన రాహుల్ బొజ్జా వరంగల్, మెదక్, హైదరాబాద్ జిల్లాల్లో కలెక్టర్‌గానే కాకుండా.. అనేక పదవుల్లో సమర్థమైన అధికారిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ నేపథ్యంలోనే కీలకమైన నీటిపారుదల శాఖకు కార్యదర్శిగా ఆయనను ప్రభుత్వం నియమించింది. తాజాగా ప్రిన్సిపల్ సెక్రటరీగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.