28-02-2025 05:52:27 PM
మందమర్రి (విజయక్రాంతి): రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆతవాలే) పార్టీ జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షులుగా మహమ్మద్ రహమత్ ఖాన్ ను నియమిస్తూ నియామక పత్రాన్ని ఆర్పిఐ (ఏ) రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగపిండి రమేష్ అందచేశారు. శుక్రవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు ఉదృతం చేసి సమస్యల పరిష్కారంతో పాటు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. అనంతరం
మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షులు రహమత్ ఖాన్ మాట్లాడుతూ... జిల్లాలోని ప్రజా సమస్యలపై నిరంతరం అలుపెరుగని పోరాటాలు చేస్తానని జిల్లాలో పార్టీని ప్రజల ముందుకు తీసుకుపోవడానికి నా వంతుగా కృషి చేస్తానని స్పష్టం చేశారు. నాపై నమ్మకంతో పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చినందుకు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగపిండి రమేష్, జిల్లా నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి పులిపాక శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి గరిగే వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి ఎండీ యాకూబ్, నాయకులు ఎండి రహీం బాబాలు పాల్గొన్నారు.