calender_icon.png 27 November, 2024 | 5:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెహ్మాన్ నాకు తండ్రి సమానులు

27-11-2024 12:00:00 AM

ఏఆర్ రెహ్మాన్ విడాకుల వార్త, ఆయన బృందంలోని సభ్యురాలు మోహిని దే విడాకుల వార్త ఏకకాలంలో బయటకు రావడంతో వారిద్ద రిపై పుకార్లు వచ్చాయి. రెహ్మాన్ దంపతుల విడాకులతో మోహిని డేకు సంబంధం ఉందంటూ వార్తలొచ్చాయి. వీటిపై తాజాగా మోహిని దే స్పందించారు. రెహ్మాన్ తనకు తండ్రి సమానులని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం వస్తున్న రూమర్స్ తనను ఎంతగానో బాధించాయని వెల్లడించారు.

‘నాది రెహ్మాన్ కుమార్తెలది ఒకే వయసు కాబట్టి ఆయనెప్పుడూ నన్ను కూతురులానే చూసేవారు. 8 ఏళ్లకు పైగా ఆయన బృందంలో పని చేశాను. ఆ సమయంలో ఆయనతో కలిసి ఎన్నో సినిమాలకు సంగీతం, స్టేజ్ షోల వంటివి చేశాం. ఆయనంటే ఎంతో గౌరవం ఉంది. అలాంటి మాపై ఇలాంటి వార్తలు రావడం బాధాకరం. ఇలాంటి సున్నితమైన అంశాల్లో నిందలు వేయడం సరికాదు. అసభ్యంగా మాట్లాడటం నేరంగా పరిగణించాలి” అని మోహిని దే పేర్కొన్నారు.