కార్డిఫ్: టీమిండియా టెస్టు బ్యాటర్ అజింక్య రహానే తన 40వ ఫస్ట్ క్లాస్ సెంచరీ చేశాడు. కౌంటీల్లో లీస్ట్‌షైర్ తరఫున ఆడుతున్న రహానే 192 బంతుల్లో 102 పరుగులు చేశాడు. రహనే పోరాటం వల్ల లీస్ట్‌షైర్ జట్టుకు గ్లామోర్గన్ మీద ఓటమి తప్పింది. అంతర్జాతీయ జట్టులో చోటు దక్కకపోవడంతో రహానే కౌంటీల్లో ఆడుతున్నాడు. ఆస్ట్రేలియా ఆటగాడు హ్యాండ్‌కోంబ్‌తో కలిసి రహానే నాలుగో వికెట్‌కు 183 పరుగులు జోడించారు.