calender_icon.png 1 April, 2025 | 8:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం!

29-03-2025 12:18:00 AM

ఆలస్యంగా వెలుగులోకి ఘటన

 నాగర్ కర్నూల్ మార్చి 28 విజయక్రాంతి నాగర్ కర్నూల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ భూతం కలకలం రేపింది. ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని మరి కొంతమంది సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడుతూ చిత్రహింసలకు గురి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదులుతాయి ఈ నేపథ్యంలో ఈ నెల 26న స్థానిక పోలీసులు మెడికల్ కళాశాల చేరుకొని విద్యార్థుల మధ్య చిల్లరేగిన గొడవ గురించి ఆరా తీసారు రెండు వర్గాల నుంచి ఫిర్యాదులను స్వీకరించి కేసు నమోదు చేశారు.

మొదటి సంవత్సరం చదువుతున్న దీపక్ శర్మ అనే విద్యార్థిని సీనియర్ హర్షవర్ధన్, సెకండ్ ఇయర్ విద్యార్థి లోకేష్, హిమ వర్ధన్ లు ముగ్గురు కలిసి దీపక్ శర్మను 417గదికి రప్పించి గోడకుర్చీతో పాటు గాలిలోనే కుర్చీ ఉన్నట్లుగా నటించాలని ర్యాగింగ్కు పాల్పడ్డారు. లేని సిలిండర్ ఉన్నట్లు మోయాలని పనిష్మెంట్ ఇచ్చారు. తన ఫోన్ తీసుకొని వ్యక్తిగత ఫోటోలు ,వీడియోలు తీసి వాటిని ప్రిన్సిపల్,  తల్లిదండ్రులకు పంపుతామని  బెదిరించారు. యూపీఐ పిన్ నెంబర్ చెప్పకపోవడంతో కోపానికి లోనై బెల్టుతో చితకబాదారు. బాధితుడు వారి నుంచి తప్పించుకొని నేరుగా ఈనెల 26న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కాగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.