కొట్టాయం, ఫిబ్రవరి 12: కేరళ లోని కొట్టాయం ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం సృష్టిం చింది. సభ్యసమాజం తలదించుకునే రీతిలో సీనియర్లు వ్యవహరించిన తీ రు విచారకరం. జూనియర్ల ప్రేవేట్ పార్ట్స్‌కు డంబెల్స్ వేలాడదీసి.. కం పాస్‌లతో పొడిచి పైశాచిక ఆనందం పొందేవారని పోలీసులు వెల్లడించా రు. ఇలా మూడు నెలల పాటు వ్య వహరించినట్లు తెలిపారు.