calender_icon.png 4 March, 2025 | 1:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరారీలో రాగి వీరాచారి..

03-03-2025 06:25:09 PM

వీరాచారి కోసం విస్తృతంగా గాలిస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు..

ముషీరాబాద్ (విజయక్రాంతి): గోల్కొండ చౌరస్తాలో గల ప్రతిష్టాత్మక హెబ్రోన్ చర్చిలో పలు వివాదాలకు మూల కారకుడుగా ఉన్న రాగి వీరాచారి ప్రస్తుతం పరారీలో ఉన్నారని, ఆయన కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు నగరంలో విస్తృతంగా గాలిస్తున్నారని బ్రదర్ ఎం. మాధవరెడ్డి అలియాస్ అద్దంకి ఇమ్మనుయెల్, బ్రదర్ శాంసన్, బ్రదర్ ముత్తయి, బ్రదర్ రేపాక సైమన్ లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అశ్వాపురం పోలీస్ స్టేషన్లో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను దొంగిలించారనే ఆరోపణపై రాగి వీరాచారిపై కేసు నమోదు అయిందని, జిల్లా కోర్టు రాగి వీరాచారిని దోషిగా తేల్చి తొమ్మిది నెలలపాటు కఠిన కారాగార శిక్ష విధించగా, వీరాచారి హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించినప్పటికీ.. సుప్రీంకోర్టు కూడా కింది కోర్టు తీర్పును సమర్థించిందని తెలిపారు.

సుప్రీంకోర్టు తీర్పును కూడా వీరాచారి తుంగలో తొక్కి పరారీలో ఉన్నట్లు పోలీసులను మేనేజ్ చేశారని, 2025 ఫిబ్రవరి 24వ తారీఖున జిల్లా కోర్టు కల్పించుకొని మరొకసారి రాగి వీరాచారిని పట్టుకొని శిక్షించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చిందన్నారు. తాజా కోర్టు ఆదేశాలతో భద్రాది కొత్తగూడెం జిల్లా పోలీసులు అతని కోసం రాగా ముందస్తు సమాచారం అందుకున్న వీరాచారి పరారయ్యారని, ఫిబ్రవరి 27వ తేదీ వరకు హైదరాబాదులో యదేచ్చగా తిరిగిన రాగి వీరాచారి కనపడకుండా పరారీ కావడం వెనక స్థానిక చిక్కడపల్లి, ముషీరాబాద్ పోలీసుల ప్రమేయం ఉన్నట్లు వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

రాగి వీరాచారిపై కొత్తగూడెంలో బొగ్గు దొంగతనంతో మొదలుపెట్టి ఎర్రచందనం స్మగ్లింగ్, దోపిడీలు, దొంగతనాలు, చెక్ బౌన్స్, కిడ్నాప్, బ్లాక్ మెయిల్, మోసం, భౌతిక దాడులు, వ్యవస్థీకృత నేరాలు వంటి మొత్తం 58 కేసులు 1992 నుంచి ఇప్పటివరకు వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదయ్యాయని తెలిపారు. వీరాచారి నేర చరిత్రను చూసిన అప్పటి నల్లగొండ జిల్లా ఎస్పీ అతని మీద రౌడీషీట్ ను ఓపెన్ చేశారన్నారు. నల్గొండ జిల్లా నుంచి హైదరాబాద్ కు మకాం మార్చి దొంగతనాలు చేసి డబ్బు సంపాదించే బదులుగా ఒక మత సంస్థలోకి అక్రమంగా దోరబడి కోర్టు కేసులు చూస్తానని పెద్దలను ఒప్పించి మరో నయీంగా మారి హెబ్రోన్ చర్చిలో కూడా క్రిమినల్ నేరాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. శాంతి కాముకునిగా మారిపోయానని నమ్మించి రౌడీషీట్ ఎత్తి వేయించుకున్నాడని, చెక్ బౌన్స్ కేసులో ఐపి పెట్టి రెండు జతల బట్టలు, రెండు గిన్నెలు మాత్రమే ఉన్నాయి అని చెప్పి కోర్టును నమ్మించిన వ్యక్తి ఈరోజు వందల కోట్లు రూపాయలు ఎలా సంపాదించారని ప్రశ్నించారు.

హెబ్రోన్ చర్చ్ భక్తులు సమర్పిస్తున్న కానుకలను ఎదేచ్ఛగా దొంగిలిస్తూ పెట్రోల్ బంకులు, నల్గొండ జిల్లాలో రెడీమిక్స్ కంపెనీ, టింబర్ డిపోలు, మిర్యాలగూడలో అపార్ట్మెంట్లు, హైదరాబాదులోని వనస్థలిపురంలో స్థలాలు, ఇండ్లు, ముషీరాబాద్ లో ఎన్నో అపార్ట్మెంట్లు సంపాదించారని ఆరోపించారు. ఈ నేర చరిత్ర ఉన్న వ్యక్తికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్, ఢిల్లీ మాజీ కాంగ్రెస్ మైనార్టీ వింగ్ నేత అనిల్ థామస్ లు సంపూర్ణ సహకారం ఎందుకు అందిస్తున్నారని ప్రశ్నించారు. స్థానిక పోలీసులను మేనేజ్ చేసి రాగి వీరాచారిని చట్టానికి దొరకకుండా పోలీసులను ఎందుకు మేనేజ్ చేస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం, పోలీస్ లు కళ్ళు తెరిచి తగిన చర్యలు తీసుకోకపోతే ఇతని నేరాలు తీవ్రమయ్యే ప్రమాదం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.