హైదరాబాద్,(విజయక్రాంతి): సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట ఘటనలో విచారణకు పోలీసుల ఎదుట అల్లు అర్జున్ హాజరయ్యారు. ఈ ఘటనపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. సినీ నటుడు అల్లు అర్జున్ పై కేసు పెట్టి చిన్న సమస్యను రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా చెస్తోందని ఆయన విమర్శించారు. ఆ రోజు థియేటర్ వద్ద భద్రతా వైఫల్యాన్ని పక్కనపెట్టి ప్రభుత్వం నటుడిని మాత్రమే కారణంగా చూపుతుందంటూ రఘునందన్ ఆరోపించారు.
సినీ నటులపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షగట్టినట్లు ప్రవర్తించడం సరికాదని తెలిపారు. ఈ కేసు రాష్ట్రంలోని ఇతర చిన్న కేసుల్లాంటిదని, ఆ తొక్కిసలాటలో పోలీసులు, నటుడి పాత్ర ఏమిటి? ఎవరు విఫలమయ్యారో చూసే బదులు సినిమా థియేటర్ అధికారులకు, పోలీసులకు నా విన్నపం. న్యాయస్థానం ఇప్పటికే 30 రోజుల బెయిల్ ఇచ్చినందున పోలీసులు ఎవరిపైనా కఠిన చర్యలు తీసుకోకూడదని రఘునందన్ రావు పేర్కొన్నారు.