calender_icon.png 29 April, 2025 | 9:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈఆర్‌సీ సభ్యులుగా రఘు, శ్రీనివాసరావు

29-04-2025 01:22:11 AM

హైదరాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర విద్యు త్ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ) సభ్యులుగా కే రఘు, చెరుకూరి శ్రీనివాసరావు నియమిస్తూ ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిద్దరు 5 ఏళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.

ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీసెస్‌కి చెందిన శ్రీనివాసరావు 2016, జూలై 26 నుంచి ట్రాన్స్‌కో జేఎండీగా కొనసాగుతున్నారు. అంతకుముందు ఆయన టీజీఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌గా పనిచేశారు. కే రఘు ప్రస్తుతం ట్రాన్స్‌కో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. 2017 మధ్య కాలంలో ట్రాన్స్ కో చీఫ్ ఇంజినీర్‌గా వ్యవహరించారు.

ఏపీ స్థానికత కలిగిన విద్యుత్ ఉద్యోగులను సుప్రీంకోర్టు ఆదేశాలతో తెలంగాణ ట్రాన్స్‌కోలో చేర్చు కోవడంతో సీనియారిటీ కోల్పోయిన కే రఘు డబుల్ ప్రమోషన్ పొంది ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా బదిలీ అయ్యారు. ఈఆర్సీ చైర్మన్‌గా జస్టిస్ దేవరాజు నాగార్జున గతేడాది అక్టోబర్‌లో బాధ్యతలు స్వీకరించగా, తాజాగా ఇద్దరు  సభ్యులను ప్రభుత్వం నియమించింది.