- వృత్తిలోనే ప్రవృత్తిని వెతుక్కొని..
- సమాజ హితం కోసం తపిస్తున్న అధికారి
- 20 ఏళ్లుగా పొగాకు నియంత్రణపై పోరాటం
- రఘునందన్ మాచన సామాజిక స్పృహ అభినందనీయం
హైదరాబాద్, జనవరి ౩ (విజయక్రాంతి) : వృత్తిలోనే ప్రవృత్తిని వెతుక్కున్నారు ఆ అధికారి. సగటు మనిషిపై వ్యసనపరుడిగా ము ద్ర వేస్తున్న పొగాకు ఉత్పత్తులకు వ్యతిరేకం గా పోరాటం సలుపుతున్నారు. పొగాకు ఉత్పత్తుల బారిన పడుతూ ప్రాణాంతకమైన వ్యాధులను కొనితెచ్చుకోవద్దని చెప్తూ సమా జ శ్రేయస్సుకు పాటుపడుతున్నారు.
పొగా కు ఉత్పత్తులకు వ్యతి రేకంగా తనదైన రీతిలో పోరాటం చేస్తున్నారు. పొగాకు వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ అందరిలో అవగాహన కల్పిస్తున్నారు. పొగాకు.. వ్యసనపరుల బతుకుల్లో పొగ బెడు తున్న తీరును సామాజిక మాధ్యమాల్లో వివరించడం ద్వారా పొగా కు ఉత్పత్తులపై రగల్ జెండా ఎగురవేసిన రఘునందన్ సేవలు అభినం దనీయం.
సామాజిక స్పృహతో..
రఘునందన్ మాచన.. మేడ్చల్ జిల్లా కేశవరం వాస్తవ్యుడు. ఆయన తండ్రి అభిమన్యు ఆంగ్లభాషా పండితుడు. ఆయన రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తూ ఉత్తమ ఉపాధ్యాయుడిగా రాష్ట్రపతి పురస్కారాన్నందుకున్నారు. అలా భావి పౌరులను తీర్చిదిద్దే క్రమంలో తనదైన సేవలు అందిస్తూ ఉత్తమ ఉపాధ్యాయుడిగా పేరు గడించారు అభిమన్యు.
తం డ్రికి తగ్గ కొడుకు అనిపించుకునేలా రఘునందన్ సమాజ శ్రేయస్సు కోసం తనవంతు కృషి చేస్తున్నారు. యువత పెడదోవ పట్టకుండా తనదైన రీతిలో స్పందిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారాయన. పౌర సరఫరాల శాఖలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్‌గా నిత్యం దాడులు, తనిఖీలు నిర్వ హించే అధికారులు ఎందరో ఉన్నారు.
కానీ రఘునందన్ మాచన అలా కాదు. ఉద్యోగాన్ని తన విధిగానో, ఓ అధికారిగా తాను నిర్వర్తించాల్సిన బాధ్యతగానో మాత్రమే భావించలేదాయన. అందులో మానవత దృక్పథాన్ని వెతుక్కున్నారు. సమాజాన్ని మా ర్చాలన్న తపన ఆయనలో కనిపిస్తుంది. అలా కమిట్‌మెంట్‌తో సామాజిక స్పృ హతో పనిచేస్తుంటారు రఘునందన్.
సామాజిక మాధ్యమాల ద్వారా అవగాహన కల్పిస్తూ..
పొగాకు నియంత్రణపై రఘునందన్ సామాజిక మాధ్యమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. పొగాకు ఉత్పత్తులకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోస్టులు అంతర్జాతీయంగా అన్ని సమాజాలను చేరుతూ ఆలోచింపజేస్తున్నాయి. ఎక్స్ ద్వారా ఆయన పొగాకు ఉత్పత్తులకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారం, జర్మనీ దేశస్తులను ఆకట్టుకోగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తమ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా రఘునందన్‌ను ఆహ్వానించింది.
దేశం తరఫున పాల్గొనడం ఆనందాన్నిచ్చింది..
పంజాబ్ ఛండీగడ్‌లో జరిగిన పొగాకు నియంత్రణ అంతర్జాతీయ సదస్సులో భారత్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ గౌరవ ప్రతినిధిగా నేను పా ల్గొనడం ఆనందాన్నిచ్చింది. పొగాకు ఉత్పత్తుల వల్ల ఆరోగ్యానికీ, ఐశ్వర్యానికీ ముప్పు వాటిల్లక ముందే.. టుబా కోకు గుడ్ బై చెప్పాలన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో కలగాలని ఆశిస్తున్న వారిలో నేనొకణ్ని. నేను సుమారుగా రెండు దశాబ్దాలుగా పొగాకు ఉత్పత్తులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నా.
ఆ ఫలాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి. రిసోర్స్ సెంటర్ ఫర్ టుబాకో కంట్రోల్ సంస్థ ‘టుబాకో కంట్రోల్ స్టాల్ వర్ట్’గా నా సేవలను గుర్తించిం ది. అమెరికాకు చెందిన హెల్త్ మ్యాగజీన్ పల్మనరీ మెడిసిన్ కూడా నా సక్సెస్‌ను గుర్తిస్తూ వావ్.. వెల్డన్ అని కొనియాడింది. ఇటీవల పలువురు నన్ను అభినందించడం ఆనందాన్నిచ్చింది. ఈ అభినందనలన్నీ నా బాధ్యతను మరింత పెంచాయి.
రఘునందన్ మాచన