calender_icon.png 20 November, 2024 | 5:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యాలయాల్లో ర్యాగింగ్‌ను అరికట్టాలి

20-11-2024 02:22:36 AM

పీడీఎస్‌యూ డిమాండ్, ధర్నా 

ఖమ్మం, నవంబర్ 19 (విజయక్రాంతి): ఖమ్మం మెడికల్ కాలేజీ విద్యార్థికి గుండు గీయించడం దుర్మార్గమని, విద్యాలయాల్లో ర్యాగింగ్ భూతాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం ఖమ్మం చర్చికాంపౌండ్‌లో విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా  నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్, నాయకులు వినయ్‌కుమార్ మాట్లాడుతూ.. ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో జరిగిన  ఘటనలోని వాస్తవాలను ప్రిన్సిపాల్ పక్కదారి పట్టిస్తున్నారని, ఘటన గురించి ఎవరికైనా చెబితే పరీక్షల్లో ఫెయిల్ చేయడంతో పాటు కాలేజీ నుంచి పంపిస్తామని విద్యార్థులను బెదిరిస్తున్నారని ఆరోపించారు.

కలెక్టర్ స్పందించి ఈ ఘటనపై విచారణకు ఆదేశించి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పృధ్వీ, సందీప్, నరేందర్, అన్వేష్, పాషా,  యశ్వంత్, స్టాలిన్ పాల్గొన్నారు