calender_icon.png 4 March, 2025 | 5:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్లంపల్లి బాలుర గురుకులంలో ర్యాగింగ్

04-03-2025 12:47:42 AM

సిగరెట్ తాగాలంటూ విద్యార్థిని బెదిరించిన ఇంటర్ విద్యార్థులు

బెల్లంపల్లి, మార్చి 3 (విజయక్రాంతి) : బెల్లంపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాల (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ) లో సోమవారం చక్రధర్ అనే 8 వ తరగతి విద్యార్థిని బట్టలు విప్పి సిగరెట్ తాగాలంటూ ఇంటర్మీడియట్ సెకండియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేసిన సంఘటన కలకలం రేపింది.

కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడుతున్న విషయాన్ని ప్రిన్సిపల్ శ్రీధర్ కు పదవ తరగతి విద్యార్థి నిఖిల్ తెలపడంతో అతన్ని కూడా ఇంటర్మీడియట్ విద్యార్థులు కళాశాలలో చితకబాదారు. ఈ రెండు సంఘటనలతో బెల్లంపల్లి సి ఓ ఈ లో చదువుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.

కళాశాలలో విద్యార్థులపై దాడి చేసిన ఇంటర్మీడియట్ విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. పోలీసులు జోక్యం చేసుకొని విద్యార్థులు తల్లిదండ్రులను శాంతింపజేశారు. గొడవ పడిన విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి కళాశాలలో మరెప్పుడు గొడవ లకు దిగకుండా ఉండాలని హెచ్చరించినట్లు తాళ్ల గురిజాల ఎస్సు చుంచు రమేష్ తెలిపారు.