calender_icon.png 16 October, 2024 | 4:06 PM

వక్ఫ్ బిల్లుపై జేపీసీలో రగడ

16-10-2024 03:49:40 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 15: వివాదాస్పద వక్ఫ్ బిల్లుపై జేపీసీలో తీవ్ర విబేధాలు ఏర్పడినట్లు సమాచారం. బిల్లులోని పలు అంశాలపై అధికార బీజేపీ, ప్రతిపక్ష ఎంపీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకొన్నది. దీంతో విపక్ష సభ్యులు కొందరు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. సోమవారం కూడా విపక్ష సభ్యు లు వాకౌట్ చేశారు. బీజేపీ ఎంపీలు అభ్యంతరకరమైన భాష వాడుతున్నారని విపక్ష సభ్యులు ఆరోపించారు.

మంగళవారం నాటి సమావేశంలో వక్ఫ్ బోర్డులో మహిళకు స్థానం కల్పించే అంశంపై బీజేపీ ఎంపీలు నిషికాంత్ దూబే, దిలీప్ సైకియా, అభిజిత్ గంగూలీకి టీఎంసీ, కాంగ్రెస్ ఎంపీలు కల్యాణ్ బెనర్జీ, గౌరవ్ గొగోయ్‌కి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అధికార పక్ష సభ్యులు సమావేశాన్ని సరిగ్గా నిర్వహించటంలో జేపీసీ చైర్‌పర్సన్ జగదాంబి కాపాల్ విఫలమయ్యారని విపక్ష సభ్యు లు ఆరోపించారు. విపక్ష సభ్యులే సమావేశాన్ని అడ్డుకొన్నారని బీజేపీ ఎంపీలు ఆరోపించారు.