calender_icon.png 13 January, 2025 | 12:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమిత్ష వ్యక్యలపై రగడ

19-12-2024 02:07:22 AM

* దద్దరిల్లిన ఉభయ సభలు.. వాయిదా

* ఫ్యాషన్ వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి

* పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి నిరసన

*అంబేద్కర్‌ను అవమానించారు: రాహుల్

* అంబేద్కర్‌ను గౌరవించేది మేమే: ప్రధాని మోదీ

* నా వ్యాఖ్యలను వక్రీకరించారు: అమిత్ షా

* కేంద్రమంత్రిపై ప్రివిలేజ్ నోటీసు ఇచ్చిన టీఎంసీ

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: రాజ్యసభలో బీఆర్ అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ‘ఫ్యాషన్’ వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం ఉభయ సభలు దద్దరి ల్లాయి. అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని ఇండియా కూటమి నేతలు డిమాండ్ చేశారు. తాను చేసిన వ్యాఖ్యలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాల నిరసనలతో రాజ్యసభ అట్టుడికింది. దీంతో సభను గురువారానికి వాయిదా వేశారు. అమిత్‌షా వ్యాఖ్యలపై రాహుల్‌తోపాటు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు అమిత్ షాపై టీఎంసీ సభా హక్కుల నోటీసు ఇచ్చింది. హోంమంత్రి రాజీనామా చేయాలని కాంగ్రెస్ కోరగా.. ప్రతిపక్ష పార్టీ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోందని బీజేపీ ఆరోపించింది. కాగా దేశవ్యాప్తంగా అమిత్ షా ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. 

అంబేద్కర్ పేరు ఫ్యాషన్‌గా మారింది: అమిత్ షా

రాజ్యాంగంపై చర్చ సందర్భంగా రాజ్యసభలో  కాంగ్రెస్ పార్టీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి అంబేద్కర్ పేరును వినియోగించుకోవడం‘ఫ్యాషన్’గా మారిందని అన్నా రు. అంబేద్కర్, అంబేద్కర్ అని పలుమార్లు జపం  చేస్తున్నారని, అందుకు బదులుగా దేవుడి పేరు తలుచుకుంటేనైనా పుణ్యం వస్తుందని, స్వర్గానికి వెళ్లొచ్చని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సహా మిగితా పక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. 

ఇండియా కూటమి నిరసన..

అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యల కు నిరసనగా లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా కూటమి నేతలు బుధవారం ఉదయం పార్లమెంట్ బయట నిరస నకు దిగారు. అంబేద్కర్ ఫొటోలు పట్టుకుని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కూట మి నేతలు కేంద్రంపై, మోదీ, అమిత్‌షాపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భం గా రాహుల్ మాట్లాడుతూ అంబేద్కర్‌ను అవమానిస్తే దేశం సహించదని అన్నారు. వెంటనే అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్  చేశారు. మరోవైపు దేశానికి దిశానిర్దేశం చేసిన మహనీయుడు అంబేద్కర్ అని, ఆయనను, ఆయన రూపొందించిన రాజ్యాంగాన్ని అవమానిస్తే దేశం సహించద ని ఫేస్‌బుక్ వేదికగా రాహుల్ పోస్ట్ చేశారు. మనుస్మృతిని విశ్వసించే వారు కచ్చితంగా అంబేద్కర్‌తో విభేదిస్తారని ట్వీట్ చేశారు.

అమిత్ షాను బర్తరఫ్ చేయాలి: ఖర్గే

అంబేద్కర్‌పై విశ్వాసం ఉంటే అమిత్ షాను వెంటనే కేంద్ర మంత్రివర్గం నుంచి ప్రధాని మోదీ బర్తరఫ్ చేయాలని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే డిమాం డ్ చేశారు.  లేకపోతే ప్రజలు వీధుల్లోకి వస్తారని హెచ్చరించారు.  కేంద్ర హోం మంత్రి అవమానించినా అంబేద్కర్ దేవుడి కంటే తక్కువేం కాదని ఖర్గే అన్నారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ అంబేద్కర్‌ను అవమానించడంతో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ జాతీ య జెండాకు, అశోక చక్రానికి వ్యతిరేకమని మరోసారి రుజువైందని విమర్శించారు. దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీలు, పేద లకు దూతగా ఉంటారని పేర్కొన్నారు. దేశంలో మనుస్మృతిని అమలు చేయాలనుకుంటున్నారని ఖర్గే ఆరోపించారు.  

ఆత్మగౌరవానికి ప్రతీక అంబేద్కర్: ప్రియాంక

కోట్లాది మంది దళితుల, అణగారిన వ ర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక అంబేద్కర్ అని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకగాంధీ అన్నారు. కాగా తమకు స్వర్గం తెలియదని, కానీ  రా జ్యాంగం లేకపోతే అణగారిన వర్గాలవారిని ఈ భూమి మీద జీవించనివ్వరని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. అం బేద్కర్‌పై అవమానకర వ్యాఖ్యలు చేయడం దారుణమని పశ్చిమబెంగాల్ సీఎం మమ తా బెనర్జీ అన్నారు. ద్వేషంతో నిండిపోయిన పార్టీ నుంచి ఇంకేమి ఆశించగలమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీయే పార్టీలు అమిత్‌షా వ్యాఖ్యలతో ఏకీభవిస్తాయా అని శివసేన (యూబీటీ) నేత ఉద్దవ్ ఠాక్రే ప్రశ్నించారు. అంబేద్కర్ పేరును కాంగ్రెస్, బీజేపీ లు రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నాయని బీఎస్పీ అధినేత మాయావతి విమర్శించారు. 

అంబేద్కర్‌ను కాంగ్రెస్సే  అవమానించింది: రిజిజు

ప్రతిపక్షాల ఆరోపణలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. తన ప్రసంగంలో అంబేద్కర్‌పై అమిత్ షా తన గౌరవాన్ని స్పష్టంగా చూపించారని, ఎక్కడా అవమానించలేదన్నారు. అంబేద్కర్‌కు ఇన్నాళ్లు భారతరత్న  ఇవ్వకుండా అవమానించింది కాంగ్రెస్సేనని ఆరోపించారు. బాబాసాహెబ్‌ను కుట్ర చేసి 1952 ఎన్నికల్లో ఓడించిందని పేర్కొన్నారు.

ప్రివిలేజ్ నోటీసు ఇచ్చిన టీఎంసీ

అంబేద్కర్‌పై కేంద్ర హోమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు గాను ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసును (ప్రివిలేజ్ మోషన్)ను టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ ఇచ్చా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమిత్ షా వ్యాఖ్యలు అంబేద్కర్‌ను తక్కువ చేయడమే కాకుండా ఆయన వారసత్వాన్ని,  సభ గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. సభా మర్యాద ను కించిపరిచినందుకు అమిత్‌షాపై చర్యలు తీసుకోవాలని కోరారు.

అంబేద్కర్‌కు వ్యతిరేకంగా మాట్లాడలేదు: అమిత్ షా

తాను ఏనాడు భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్‌కు వ్యతిరేకంగా మాట్లాడలేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. మంగళవారం తాను రాజ్యసభలో అంబేద్కర్‌ను అవమానించానంటూ కాంగ్రెస్, ఇండియా కూట మి దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నా యి. షాను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలంటూ ఖర్గే డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో అమిత్ షా మాట్లాడారు. రాజ్యసభలో తాను చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరించిందన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

తన వ్యాఖ్యలపై కాంగ్రె స్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అంబేద్కర్ వ్యతిరేక వైఖరిని కాంగ్రెస్ అవలంభిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటినుంచి అంబేద్కర్‌కు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని ఆరోపిం చారు. కాంగ్రెస్ ఏనాడు అంబేద్కర్ స్మారకాన్ని నిర్మించలేదన్నారు. రిజర్వేషన్లను, అంబేద్కర్‌ను, రాజ్యాంగాన్ని వ్యతిరేకించిన పార్టీ కాంగ్రెస్ అని ఆయన ధ్వజమె త్తారు. అంబేద్కర్‌ను బీజేపీ ప్రభుత్వం ఎంతో గౌరవించిందని తెలిపారు. అంబేద్కర్‌ను భారతరత్న పురస్కారంతో గౌర వించామని తెలిపారు. అలాగే పార్లమెంట్ సెంట్రల్ హాల్లో అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టామన్నారు. 

తాను ఎన్నడూ అంబేద్కర్‌ను అవమానించని పార్టీ నుంచి వచ్చా నని ఆయన స్పష్టం చేవారు. కలలో కూడా అంబేద్కర్ ఆలోచనలను అవమానించలేని పార్టీ, సిద్ధాంతం నుంచి తాను వచ్చానని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి గందరగోళం లేకుండా  స్పష్టంగా ఉన్న తన ప్రసంగం రాజ్యసభ రికార్డుల్లో ఉందన్నారు. రాజ్యసభలో ఉన్న తన ప్రసంగా న్ని ప్రజలకు మీడియా చూపించాలని కోరారు. తాను రాజీనామా చేస్తే మల్లికార్జున ఖర్గే సంతోషపడతారంటే రాజీనా మా చేస్తానని, కానీ మరో 15 ఏండ్లు వారు ప్రతిపక్షంలోనే ఉండాలన్నారు. తన రాజీనామాతో వారిని మార్చలేమని ఆయన చెప్పారు.