కోరోవ్, జూలై 30: ఫ్రెంచ్ గయానాలోని కోరోవ్ ఐరోపా అంతరిక్ష కేం ద్రం చేపట్టిన రాకెట్ ప్రయోగం సాంకేతిక సమస్యతో విఫలమైంది. రాకెట్ వెంట రక్షణ వలయంగా రాఫెల్ ఫైటర్ జెట్లను పంపించగా, రాకెట్ కాస్తా ఎలాంటి ప్రమాదానికి ఆస్కారం ఇవ్వకుండా సముద్రంలో కూలింది. దీంతో కథ సుఖాంతమైంది. ఈ నెల 9న ఐరోపా అంతరిక్ష కేంద్రం ఏరియన్ 6 అనే రాకెట్‌ను ప్రయోగించింది. నిర్దేశించిన సమయం కంటే ఆలస్యంగా ప్రయోగం ప్రారంభమైంది. రాకెట్ గగనతలంలోకి దూసుకెళ్లిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్య తలెత్తింది.
పేలోడ్‌ను విడిచిపెట్టకుండా భూవాతావర ణాన్ని దాటడంతో శాస్త్రవేత్తలు వెంటనే ఫ్రాన్స్ ఎయిర్ అండ్ స్పేస్ ఫోర్స్ సాయంతో రాకెట్ వెంట మూడు రాఫేల్ యుద్ధవిమానాలు, రెండు యూరోకాఫ్టర్ ఫెన్నిక్స్, ఒక పూమా ఇన్‌ఫాంట్రీ ఫైటింగ్ వెహికిల్‌ను నింగిలోకి విడిచిపెట్టారు. అవి రక్షణ వల యంగా వెళ్తుండగా రాకెట్ సముద్రం లో పడిపోయింది. రాకెట్ శకలాలు గగనతలం లేదా భూమిపై పడి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకే యుద్ధవిమానాలు రంగంలోకి దిగాయి. కానీ అది కాస్తా సము ద్రంలో పడిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రాకెట్ వెంట యుద్ధవిమానాలు వలయంగా వెళ్లిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యాయి.