29-04-2025 01:17:45 AM
ఇక శత్రువులకు చుక్కలే
న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: భారత నేవీ మరింత బలోపేతం కానుంది. నేవీకి ఫ్రాన్స్ నుంచి 26 రఫేల్ జెట్ విమానాలు అందనున్నాయి. ఇందుకు సంబంధించి 63 వేల కోట్లతో భారత్ మధ్య సో మవారం న్యూఢిల్లీలోని నౌసేనా భవన్‌లోఒప్పందం కుదిరింది. ఫ్రెంచ్ అంబాసిడర్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి రక్షణ శాఖ సెక్రటరీ రాజేశ్‌కుమార్‌సింగ్, నేవీ వైస్ చీఫ్ అడ్మిరల్ స్వామినాథన్ హాజరై సంతకాలు చేశారు.
2029లో మొదలు..
రఫేల్ జెట్ డెలివరీలు 2029 నుంచి మొదలుకానున్నా యి. 2031లోపు మొత్తం 26 జెట్స్ నేవీకి అందుతాయి. ఏప్రిల్ 9న ఈ జెట్స్ కొనుగోలు రక్షణ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ డీల్‌లో భాగంగా 22 సింగిల్ సీటర్, 4 ట్విన్ సీటర్ జెట్స్ నేవీకి అందనున్నాయి. ప్రస్తుతం భారత్ ఉన్న మిగ్ జెట్స్ స్థానాన్ని ఈ జెట్స్ భర్తీ చేయనున్నాయి. ప్రస్తుతం భారత వాయుసేన వద్ద మొత్తం 36 రఫేల్ యుద్ధ విమానాలు ఉండగా.. త్వరలో రఫేల్ జెట్స్ నేవీకి కూడా అందనున్నాయి.