రోమ్: గాయంతో సుదీర్ఘ కాలం ఆటకు దూరమై తిరిగి మైదానం లో అడుగుపెట్టిన స్పెయి న్ బుల్ రఫేల్ నాదల్ ఆకట్టుకోలేకపోయాడు. ఏడాదిన్నర తర్వాత తొలిసారి టాప్ ప్లేయర్ తో మ్యాచ్‌లో నాదల్ ప్రభావం చూపలేకపోయాడు. ఇటాలియాన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో నాదల్ 1 3 ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ హుర్కాజ్ చేతిలో పరాజయం పాలయ్యాడు. గత రెండు రౌండ్లలో సులువైన ప్రత్యర్థుల మీద సునాయాసంగా నెగ్గిన 37 ఏళ్ల నాదల్.. హుర్కాజ్పై అదే ప్రతాపం చూపలేకపోయాడు. తుంటి గాయంతో నిరుడు మొత్తం కోర్టుకు దూరంగా గడిపిన నాదల్.. మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి. ఇతర మ్యాచ్‌ల విషయానికి వస్తే ముల్లెర్ 7 6 ఫిల్స్‌పై.. మెద్వెదెవ్ 7 6 డ్రాపెర్పై గెలవగా.. మహిళల సింగిల్స్‌లో నవోమీ ఒసాకా, కెర్బర్, స్వియాటెక్, ముందంజ వేశారు.