చెన్నై: హేమ కమిటీ రిపోర్ట్ పై సినీ పరిశ్రమలో సంచలనం రేపుతూన్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ విషయం పై రజనీకాంత్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. హేమ కమిటీ రిపోర్ట్ గురించి తనకేం తెలియదని ఆయన అనడంతో విమర్శలు వచ్చాయి. హేమ కమిటీ రిపోర్ట్ అగ్ర నటులు మౌనం వహించడాన్ని ఆమె తప్పు పట్టారు. మీ మానాన్ని ప్రజలు తప్పుగా భావిస్తారన్నారు. అగ్రతారలంతా బయటకు వచ్చి దీని గురించి మాట్లాడాలి. స్టార్ హీరోల మాటలకు ఎంతో ఉపశమనమిస్తాయి. శేధింపులకు గురైన మహిళల్లో న్యాయం పై ఆశను కలిగిస్తాయి. అలాగే ప్రజలందరూ కూడా ఈ సమస్యపై స్పందించాలన్నారు.ప్రస్తుతం కోలీవుడ్ లో అగ్ర స్థానంలో ఉన్న నటీనటులు చాలా మంది రాజకీయ ప్రస్థానాన్ని కలిగి ఉన్నరని గుర్తు చేశారు. సమాజం కోసం ఆందోళనలు చేసే ముందు.. సోదర భావంతో తోటి నటీమణుల బాధను అర్థం చేసుకుని వాళ్లకు మద్దతు తెలియజేయాలన్నారు. కాగా హేమ కమిటీ రిపోర్ట్ పై రాధిక శరత్ కుమార్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.