ఎస్‌ఎస్ సైదులు, భ్రమరాంబిక, అర్పిత లోహి హీరోహీరోయిన్లుగా తెరకెక్కనున్న చిత్రం ‘1980లో రాధే కృష్ణ’. ఇస్మాయిల్ షేక్ దర్శకత్వంలో ఎస్‌వీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఊడుగు సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ లాంచ్ ఈవెంట్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. నిర్మాతలు బెక్కం వేణుగోపాల్, రామ్ తల్లూరి, హీరో సోహెల్, ఆటో రాంప్రసాద్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో అతిథులు, నటీనటులు, మిగతా చిత్రబృందం మాట్లాడి తమ అభిప్రాయాలు, అనుభవాలను వెల్లడించారు. ఈ చిత్రాన్ని తెలుగు, బంజారా రెండు భాషల్లో విడుదల చేయనున్నట్టు మేకర్స్ వెల్లడించారు.