calender_icon.png 23 February, 2025 | 4:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదింటి వివాహాలకు రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ రూ.42వేల సాయం

21-02-2025 12:00:00 AM

కడ్తాల్, ఫిబ్రవరి 20: కడ్తాల్ మండలంలోని పేదింటి  వివాహాలకు జర్పుల రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ 42వేల రూపాయల ఆర్థిక సాయంతో పాటు మేనమామ కట్నం కింద పట్టుచీర అందించడం జరిగింది.

కడ్తాల్ మండల కేంద్రానికి చెందిన కానుగుల అలివేలు-నాగయ్య దంపతుల కూతురు విజయలక్ష్మి వివాహానికి రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 21వేల రూపాయల ఆర్థిక సాయంతో పాటు మేనమామ కట్నం కింద పట్టుచీరను ట్రస్ట్ చైర్మన్ లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ జెడ్పిటిసి జర్పుల దశరథ నాయక్ గురువారం  అందించారు.

గానుగమర్ల గ్రామపంచాయతీ పరిధిలోని కాను గుబాయి తండాకు చెందిన నేనావత రాజు అనిత కుమార్తె ఝాన్సీ వివాహానికి 21 వేల రూపాయల ఆర్థిక సాయంతో పాటు పట్టుచీరను అందించారు. అలాగే ఝాన్సీ వివాహానికి స్థానిక నాయకులు డైరెక్టర్ సేవ్యా నాయక్. 25వేల  రూపాయలు, 

మాజీ ఉప సర్పంచ్ నేనావత్ శారద పాండు 50వేల రూపాయల ఆర్థిక సాయం అందించగా, మాజీ వార్డు సభ్యులు నెనావత్ లక్ష్మణ్ 75 వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు. వారికి తోడుగా , బీఆర్‌ఎస్ నాయకులు శ్రీను 10వేలు, వార్డు మెంబర్ భీమన్ 4వేలు , శంకర్ నాయక్ 5వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు.

ఈ  కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్, గ్రామ కమిటీ అధ్యక్షుడు రామకృష్ణ, నాయకులు లాయక్ అలీ, మహేష్, హెచ్ ఆర్ దాసు, కిషన్, శ్రీకాంత్, వెంకటేష్, శ్రీశైలం, కృష్ణ,  రతన్, సక్రు, వినోద్ , రవి, నరేష్, నాగేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.