calender_icon.png 9 March, 2025 | 7:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదింటి పెండ్లి కూతురుకు రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆర్థికసాయం

07-03-2025 12:12:45 AM

కడ్తాల్, మార్చి 6 ( విజయ క్రాంతి ) : కడ్తాల్ మండలంలో జర్పుల రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ పేదలకు ఆర్థిక సాయం అందిస్తూ పేదల కుటుంబాల్లో సంతోషాన్ని నింపుతుంది. ట్రస్ట్ చైర్మన్ జర్పుల దశరథ్ నాయక్ నిరంతరం ప్రజాసేవ చేస్తూ ప్రజలతోనే మమేకమవుతూ వారికి ఏ కష్టం వచ్చినా తన సొంత కష్టంగా భావించి ట్రస్టు ద్వారా అనేక పేద ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నారు.

జర్పుల రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ అనేది పేద ప్రజలకు అండగా ఉంటుందనే భరోసాను కల్పిస్తున్నారు. పేదింటి  ఆడపిల్లల పెళ్లిలకు మేనమామ కట్నం కింద 21వేలతో పాటు పట్టుచీరను కానుకగా అందిస్తున్నారు. గురువారం మైసిగండి గ్రామానికి చెందిన కేతావత్ నీలా రెడ్య దంపతుల కుమార్తె అశ్విని వివాహానికి 21వేల  రూపాయల ఆర్థిక సాయంతో పాటు పట్టుచీరను కానుకగా అందించారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తులసి రామ్ నాయక్ హరిచంద్ నాయక్, మాజీ ఎంపీటీసీలు సక్రి, ప్రియా రమేష్, మాజీ ఉపసర్పంచ్ శారదా పాండు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.