calender_icon.png 6 January, 2025 | 3:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాధాకిషన్‌రావు తరచుగా.. వారిని కలిసేవారు

07-12-2024 01:51:41 AM

ఫోన్‌ట్యాపింగ్ కేసు

  1. కేసీఆర్, హరీశ్‌నే కాదు.. కవిత, దామోదర్‌రావు, వెంకట్రామిరెడ్డితో కూడా భేటీ అయ్యేవారు
  2. డబ్బు లావాదేవీలు నిర్వహించేవారు..
  3. ఎంతోమంది ఫోన్లను టాప్ చేయించారు..
  4. బెయిల్ పిటిషన్‌పై పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదన
  5. విచారణను వాయిదావేసిన హైకోర్టు

హైదరాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): ఫోన్‌ట్యాపింగ్ కేసులో ఏ5 నిందితుడైన పి.రాధాకిషన్‌రావు టాస్క్‌ఫోర్స్ డీసీపీ స్థాయి విధులు నిర్వహిం చాల్సి ఉండగా, ఆయన ఆ పనిచేయకుండా ఇతర వ్యక్తులకు సంబంధించిన పనులు చేస్తుండేవారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

తనకు బెయిల్ మంజూరు చేయాలని రాధాకిషన్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ కె.సుజన శుక్రవారం విచారణ చేపట్టారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదన తన వినిపిస్తూ.. ‘రాధా కిషన్‌రావు ప్రైవేటు వ్యక్తుల నుంచి నిధులు తీసుకువచ్చి, వాటిని మరోచోటికి తరలించేవారు.

నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, నాటి మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డితో పాటు దామోదర్‌రావు అనే వ్యక్తితో తరచూ కలిసేవారు. కేసీఆర్ సెక్యూరిటీ అధికారి అయిన రాధాకిషన్‌రావు 2020లో పదవీ విరమణ చేశారు. అయినప్పటికీ నాటి సర్కార్ ఆయన పదవీ కాలాన్ని పొడిగించి టాస్క్‌ఫోర్స్ అధికారిగా నియమించింది.

హైకోర్టు డ్రైవర్ సాయికిరణ్‌తో పాటు ఇతరులు వచ్చిన వాంగ్మూలాలను పరిశీలించా లి. రాధాకిషన్‌రావు యశోద ఆస్పత్రికి వెళ్లి మూడుసార్లు దివ్యచరణ్ అనే వ్యక్తిని కలిసి కలిశారు. వెళ్లినప్పుడల్లా రూ.కోటి నగదు తీసుకొచ్చారు. ఎమ్మె ల్సీ వెంకట్రామిరెడ్డితో పాటు పలువురికి చెందిన ఆర్థిక కార్యకలాపాలు చూసుకునేవారు.

హరీశ్ రావుపై ఇటీవల కేసు పెట్టిన చక్రధర్ గౌడ్ తన వాంగ్మూలంలో రాధాకిషన్‌రావు తనను బెదిరించినట్లు చెప్పారు. అలాగే ఎన్నికల్లో హరీశ్ రావుకు ప్రత్యర్థులుగా పోటీ చేస్తున్న వారి ఫోన్లను రాధకిషన్‌రావు ట్యాప్ చేయించారు. బీఆర్‌ఎస్ ఓడిపోతోందని తెలిసిన వెంటనే ఎస్‌ఐబీ సమాచారాన్ని రాధాకిషన్‌రావు ధ్వంసం చేయించారు.

దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఎఫ్‌ఎస్‌ఎల్ నుంచి ఇంకా సమాచారం అందాల్సి ఉంది. విచారణకు కేవలం 15 రోజుల డాటా మాత్రమే దొరికింది. డాటాలో 5 వేల మంది ఫోన్‌నంబర్లు ఉన్నాయి. 15 రోజుల్లోనే  5 వేల మంది ఫోన్లు ట్యాప్ అయ్యాయంటే 10 ఏళ్లలో ఎన్ని లక్షల మంది ఫోన్లు ట్యాప్ ఉంటారో? ఆ సమాచారం ఏమైందో తేలాల్సి ఉంది.

ధ్వంసమైన సమాచారంలో మావోయిస్టులకు సంబంధించిన సమాచారం, దేశభద్రతకు చెందిన కీలకమైన సమాచారంకూడా ధ్వంసమైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్‌రావు, ఏ6 నిందితుడు శ్రవణ్ కుమార్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నా రు. వారిని ఇండియాకు రప్పించాల్సి ఉన్నది. ఈ దశలో రాధాకిషన్‌రావుకు బెయిలు మంజూరు చేయకూడదు’ అని వాదించారు.

పిటిషనర్ తరఫు న్యాయవాది ఇ.ఉమామహేశ్వరరావు తన వాదనలు వినిపిస్తూ.. ‘రాధాకిషన్‌రావు 2023 అక్టోబర్‌లో పదవీ విర మణ చేస్తే, ఆ తర్వాత తన కిందిస్థాయి అధికారులకు ఎలా ఆదేశాలు జారీ చేస్తారు? హవాలా సొమ్ము తరలిస్తున్నారనడానికి ఆధారాలు లేవు. తనపై అనేక కేసులున్నాయని చక్రధర్ గౌడ్ చెప్తున్నారు.

కానీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆయనో గొప్పవ్యక్తిగా వాంగ్మూలం ఇచ్చారని కితాబునిస్తున్నారు. పిటిషనర్‌కు చెందిన ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక అం దింది. కోర్టులో నివేదిక భద్రంగా ఉం ది. ఇతరులకు చెందిన నివేదిక అందలేదని పిటిషనర్‌కు బెయిల్ నిరాకరించ డం సరికాదు. 

వాంగ్మూలాలూ పొంత న లేకుండా ఉన్నాయి. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని కోర్టు రాధాకిషన్‌రావుకు బెయిల్ మంజూరు చేయాలి’ అని వాదించారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి తీర్పు ను వాయిదా వేశారు. 

ప్రణీత్‌రావుకు బెయిల్ 

ఫోన్‌ట్యాపింగ్ కేసులో బెయిల్ మం జూరు చేయాలని నిందితుడు ఏ2 నిందితుడు దుగ్యాల ప్రణీత్‌కుమార్ అలియా స్ ప్రణీత్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం హైకోర్టు విచారించి ఆయనకు బెయిలు మంజూరు చేసింది.

తన బెయిల్‌ను అడ్డుకునేందుకు దర్యా ప్తు సంస్థ అభియోగ పత్రం దాఖలు చేసిందని, తనకు చట్టబద్ధమైన బెయిల్ మంజూరు చేయాలని దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. పోలీసులకు నోటీసులు జారీ చేసి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. తదుపరి విచారణను 23వ తేదీకి వాయిదా వేశారు.