రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘తిరగబడర సామీ’. ఏఎస్.రవికుమార్ దర్శకత్వంలో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా పతాకంపై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి మన్నారాపై చిత్రీకరించిన ఓ స్పెషల్ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ సోమవారం విడుదల చేశారు. రొమాన్స్, యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో రూపొందిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి మన్నారా చోప్రా విభిన్న పాత్రను పోషిస్తూ ఓ ప్రత్యేక గీతంలో అలరించనున్నదని చిత్రబృందం తెలిపింది.
‘రాధాబాయ్’ పేరుతో తాజాగా విడుదలైన ఈ పాట లిరిక్స్ భోలే షావలి రాయగా, శ్రావణ భార్గవి ఆలపించారు. ఈ పాటలో మన్నారా చోప్రా మాస్ డాన్స్ ఆకట్టు కుంది. మకరంద్ దేశ్‌పాండే, రఘుబాబు, జాన్ విజయ్, అంకిత్ ఠాకూర్, పృథ్వీ, ప్రగతి, రాజా రవీంద్ర, బిత్తిరి సత్తి ముఖ్య తారాగణంగా రూపొందుతున్న ఈ చిత్రానికి ఎడిటర్: బస్వా పైడిరెడ్డి; ఆర్ట్: రవికుమార్ గుర్రం; సంగీతం: జేబీ, భోలే షావలి; డీపీవో: జవహర్‌రెడ్డి ఎంఎన్; పాటలు: సుద్దాల అశోక్ తేజ, శ్రీమణి; ఫైట్స్: పృథ్వీ, కార్తీక్.