calender_icon.png 31 October, 2024 | 8:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బల్దియా భేటీలో రచ్చ

07-07-2024 12:55:27 AM

మేయర్, డిప్యూటీ మేయర్ రాజీనామాకు బీఆర్‌ఎస్ డిమాండ్

3 గంటల్లో 4 వాయిదాలు 

ప్రజా సమస్యలపై చర్చే లేదు

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 6 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం శనివారం రసాభాసగా సాగింది. గ్రేటర్‌లో 1.40 కోట్ల జనాభాకు సంబంధించిన సమస్యలపై చర్చించి, పరిష్కరించాల్సిన సభ్యులు అసలు అజెండాను వదిలి రాజకీయమే ప్రధానమైన అంశంగా వ్యవహరించారు. ప్రజా సమస్యలను పరిష్కరిం చాలని సమావేశం ప్రారంభానికి ముందు పలువురు సభ్యులు నిరసనలకు దిగారు. అయినా, సమావేశంలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహారించడంతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అసలేమాత్రం ప్రస్తావనకు రాకుండానే కౌన్సిల్ సమావేశం నిరవధికంగా వాయిదా పడింది.

మొత్తం 3 గంటల పాటు కొనసాగిన కౌన్సిల్ నాలుగుసార్లు వాయిదా పడింది. దీంతో నగరంలో మరణించిన కార్పొరేటర్లు, ఇతర నాయకులకు సంతాపం తెలియజేయడానికే కౌన్సిల్ సమావేశం పరిమితం కావాల్సి వచ్చింది. ఈ సమావేశం లో బీజేపీ సభ్యులు ప్రదర్శించిన ప్లకార్డును ఎంఐఎం సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వీరిరువురి మధ్య వాగ్వాదం ఘ ర్షణకు దారితీస తోపులాటకు కారణమైంది. ఈ సమావేశానికి మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్ రెడ్డి, కమిషనర్ ఆమ్రపాలి, ఎక్స్ ఆఫిసియో సభ్యులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. 

3 గంటల్లో 4 వాయిదాలు 

జీహెచ్‌ఎంసీ 9వ జనరల్ బాడీ సమావేశం శనివారం ఉదయం 10.40 కు ప్రారంభమై, మధ్యాహ్నం గం.1.40 గంటలకు ముగిసింది. ఈ సమయంలో మొత్తం 3 గంటల పాటు కొనసాగిన సమావేశం నా లుగుసార్లు వాయిదా పడింది. కౌన్సిల్ ప్రా రంభానికి మేయర్ విజయలక్ష్మి ఉదయం 10.40 సమయానికి కౌన్సిల్ హాల్లోకి వచ్చీరాగానే పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన మేయర్, డిప్యూటీ మేయర్‌లు రాజీనామా చేయాలంటూ బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు మేయర్ పోడియం చుట్టుముట్టారు. దీంతో కౌన్సిల్ ప్రారంభం కాకుండానే మేయర్ సభను వాయిదా వేశారు. అనంతరం 11.08 నిమిషాలకు తిరిగి ప్రారంభమైన సమావేశం మరోసారి మేయర్ పోడియం చుట్టుముట్టి నిరసనకు దిగారు.

దీంతో మరణించిన కార్పొరేటర్లకు సంతాపం తెలియజేయాలనే పేరుతో మేయర్ సభను మరో అర్ధగంట పా టు నడిపించారు. సంతాప తీర్మానం ముగియగానే బీఆర్‌ఎస్ సభ్యులు మరోసారి పోడి యం వద్ద నిరసనకు దిగడంతో 11.51 గంటలకు టీ బ్రేక్ పేరుతో సభ మరోసారి వాయి దా పడింది. అనంతరం మధ్యాహ్నం 12.15 గంటలకు కౌన్సిల్ తిరిగి ప్రారంభం కాగా, జీహెచ్‌ఎంసీలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన అధికారులు సభ్యులకు పరిచయం చేసుకునే పేరుతో సభను మరో అరగంట మేయర్ మేనేజ్ చేయగలిగారు. అనంతరం మళ్లీ బీఆర్‌ఎస్ సభ్యులు పోడియం వద్ద చుట్టుముట్టడంతో మధ్యాహ్నం 12.47 గంటలకు మళ్లీ వాయిదా పడింది.

ఆ తర్వాత 10 నిమిషాలకే ప్రారంభమైన కౌన్సి ల్ మధ్యాహ్నం 1 గంటకు మరోసారి వాయి దా వేయాల్సి వచ్చింది. ఈ నిరసనల మధ్య కౌన్సిల్‌ను నడిపించేందుకు మేయర్ ప్రయ త్నం చేసినా బీఆర్‌ఎస్ సభ్యులు అడ్డుకోవడంతో సభ్యుల ముందుంచిన 12 అంశా లను అప్రూవల్ చేస్తున్నట్టుగా ప్రకటించి నిరవధికంగా సమావేశాన్ని మేయర్ వాయిదా వేశారు. ఈ వాదోపవాదాలలో మేయర్, సభ్యుల మద్య కొన్ని పరుష పదా లు కూడా ప్రస్తావనకు రావడం విశేషం. 

వివాదంగా మారిన ప్లకార్డు 

బీజేపీ సభ్యులు ప్రదర్శించిన ప్లకార్డులో ‘కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం దోస్తీ.. సమస్యలతో ప్రజల కుస్తీ’ అని రాసి ఉంది. ఈ ప్లకార్డులోని రేవంత్, కేసీఆర్‌తోపాటు ఒవైసీ ఫొటో కూడా ఉంది. దీంతో ఎంఐఎం సభ్యు లు ఆ ప్లకార్డులోని ఒవైసీ చిత్రం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. అయినా బీజేపీ సభ్యులు అదే ప్లకార్డులను సభలో మళ్లీ, మళ్లీ ప్రదర్శించడంతో ఎంఐఎం సభ్యులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఈ సమయంలో ఇరువర్గాల మధ్య గలాట, తోపులా ట జరిగింది. ఈ గొడవలో ఓ కార్పొరేటర్ చొక్కా చిరిగింది. మరో కా ర్పొరేటర్‌కు చేతివేలు నలిగి ఫ్రాక్చర్ అయ్యింది. అయితే, మేయర్ సభను వాయిదా వేసి వెళ్లిన సమయంలో మేయర్ చైర్‌లో లేకున్నా బీఆర్ ఎస్, కాంగ్రెస్ సభ్యులు పోటాపోటీగా డౌన్ డౌన్ నినాదాలు ఇవ్వడంతో సభ మార్మోగింది. ఈ సమయంలో రేవంత్ రెడ్డి దొంగ అని బీఆర్‌ఎస్ వాళ్లు, కేసీఆర్ దొంగ అం టూ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.  

కమిషనర్ స్పీచ్‌పై అభ్యంతరం..

జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి మా ట్లాడుతూ బల్దియా ఆదాయాన్ని పెంచేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. ఇప్పటికే సమస్యలపై అవగాహనకు వచ్చామనీ, పరిష్కారాలు వెతుకు తున్నట్టు తెలిపారు. కాంట్రాక్టర్లకు బిల్స్ పెండింగ్‌లో ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రా పర్టీ టాక్స్ మరింత పెంచుకోవడానికి అవకాశం ఉండే జీఐఎస్ విధానం అమలుకు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ఇప్పటికే శాటిలైట్ మ్యాపింగ్ చేసి, డ్రోన్ సర్వే నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. ఆ తర్వాత ఇంటిం టి సర్వే కొనసాగుతుందన్నారు. దీని వల్ల రూ.1,900 కోట్ల ప్రాపర్టీ టాక్స్ రూ.2,500 కోట్ల దాకా పెరుగుతుందన్నారు. శానిటేషన్ సమస్య పునరావృత్తం కాకుండా జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు రోడ్లపై పర్యవేక్షణ చేస్తున్నారన్నారు. ఈ సమయం లో కమిషనర్ ఆమ్రపాలి సభలో కూర్చొని మాట్లాడటంపై సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో నిలబడిన కమిషనర్ తన ప్రసంగాన్ని ఒక వాక్యంలోనే పూర్తి చేశారు. 

మంత్రి పొన్నం లెటర్ ఉంటేనే నిధులు 

కౌన్సిల్‌లో సంతాపం పూర్తయి పిదప బీఆర్‌ఎస్ కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ లెటర్ ఉంటేనే నిధులు మంజూరు అవుతాయని ఇంజినీరింగ్ అధికారులు అన్నట్లు చెప్పారు. నిధుల మంజూరు విషయంలో పార్టీల పట్ల వివక్షత చూపించడం ఎంత వరకూ సబబు అని నిలదీశారు. ఈ విషయాన్ని మేయర్, కమిషనర్ పరిశీలించాలని కోరారు. నాలా క్యాచ్ పిట్స్ కావాలన్నా టెండర్లు వేయాలంటున్నారని, రూ. 3 లక్షలకు సంబంధించిన పనుల గురించి కూడా కమిషనర్ వద్దకు రావాలా అంటూ విమర్శించారు. 

బీజేపీ వినూత్న నిరసన... 

బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ నాయకత్వం లో ఆ పార్టీ సభ్యులు డ్రైనేజీ పైప్‌లైన్, చెరువులోని గుర్రపు డెక్కలను తీసుకొచ్చి జీహె చ్‌ఎంసీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ఈ సమావేశానికి పైప్‌లు, గుర్రపు డెక్కతో కార్యాలయం ఆవరణలోకి ప్రవేశిస్తున్న వీరిని పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత సర్థుబాటు కావడంతో జీహెచ్‌ఎంసీలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నా యంటూ.. నిధులు లేక డివిజన్లలో సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ వాపో యారు. ఈ విషయంపై మేయర్ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్ ఆమ్రపాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిలు తక్షణమే స్పందించి డివిజన్ల అభివృద్ధికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. 

దివంగత నేతలకు సంతాపం...  

ఎర్రగడ్డ కార్పొరేటర్ షాహీనా బేగం, గుడిమల్కాపూర్ కార్పొరేటర్ దేవర కరుణాకర్‌తో పాటు దివంగత నేతలు డీ శ్రీనివాస్, లాస్య నందితలకు జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం సంతాపం ప్రకటించింది. ఈ సందర్భంగా మేయర్ నేతృత్వంలో 2 నిమిషాలు మౌనం పాటించింది. అంతుకు ముందు వీరి మరణంపై ఎమ్మెల్సీ వాణిదేవి, కార్పొరేటర్లు వెల్దండ వెంకటేష్, రాధ, బొంతు శ్రీదేవి, నరసింహరెడ్డి, సోహెల్ ఖాద్రీ, రవీందర్, రాజశేఖర్‌రెడ్డి సంతాపం తెలిపారు. అయితే, బీజేపీ సభ్యులు మాట్లాడుతూ.. గుడిమల్కాపూర్ కార్పొ రేటర్ మరణించి ఏడాది కాలం గడిచినా ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదన్నారు. నిబంధనల ప్రకారం తక్షణమే ఖాళీ స్థానాలకు ఎన్నికలు జరపాలని కోరారు. కాంగ్రెస్ సభ్యులు రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. కార్పొరేటర్లు 24 గంటలపాటు ప్రజా సేవలో ఉంటున్న నేపథ్యంలో ఆరోగ్య పరంగా అనేక ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. ఈ పరిస్థితుల్లో సభ్యులకు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించాలన్నారు. 

జీహెచ్‌ఎంసీ యాక్ట్ చదువుకోండి: మేయర్ 

పార్టీ మారినందుకు మేయర్, డిపూ ్యటీ మేయర్ రాజీనామా చేయాలని బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు పదేపదే పోడియం చుట్టుముట్టడంతో అందుకు ప్రతిగా మేయర్, డిప్యూటీ మేయర్ కూడా గట్టిగానే సమాధానం ఇచ్చే ప్రయత్నంచేశారు. మీలో కూడా చదువుకున్న వాళ్లు ఉన్నారు కదా.. ఒక్కసారి జీహెచ్‌ఎంసీ యాక్ట్ చదువుకోండి. మేయర్‌పై అవిశ్వాసం పెట్టాలంటే నాలుగేళ్ల పూర్తి అయిఉండాలనే నిబంధన చట్టం చెబుతుంది. అయినా.. మిమ్మ ల్నీ పంపించిన వాళ్లకు కూడా జీహెచ్‌ఎంసీ చట్టాల గురించి తెల్వదా అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు.

నా సిటీ బాగుండాలనే ఉద్దేశ్యంతోనే పార్టీలకతీతంగా సభ్యు లందరికీ మైక్ ఇచ్చాను. మ హిళల సెక్యూరిటీ విషయంపై కొన్ని వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. దీనిని కొందరు సభ్యులు తప్పుగా అర్థం చేసుకున్నారు. కౌన్సిల్ జరగనీయోద్దనే ఉద్దేశ్యంతో సమావేశానికి వచ్చారు. జీహెచ్‌ఎంసీలో నాలుగేళ్లుగా నిధుల్లేవు. ఒక్కో డివిజన్‌కు రూ.50 లక్షల నిధులు కావాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరాం. ఇప్పటికే జీహెచ్‌ఎంసీకి రూ.1100 కోట్లు బడ్జెట్ ప్రకటించారు. ఏడాదికి రూ.500 కోట్ల ఆదాయం వచ్చేలా అడ్వరైట్‌మెంట్ విభాగంలో సరికొత్త విధానం తీసు కురా వాలని భావిస్తున్నాం. సభ్యులు వ్యవహరించిన తీరు బాధాకరం. 3 నెలలకు జరగాల్సిన కౌన్సిల్ సమావేశం 6 నెలలకు జరుగుతుంది. గంట ఓపిక లేకుంటే ఎలా అని మేయర్ ఆగ్రహించారు. 

ఎందుకు రాజీనామా చేయాలి: డిప్యూటీ మేయర్ 

రాజీనామా విషయం మనం బ యట మాట్లాడుకుందాం. ముందు గా గ్రేటర్ ప్రజల సమస్యలపై కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహిద్దాం. అయినా మేమెందుకు రాజీనామా చేయాలి. గత ప్రభుత్వం కూడా ఇలాగే వ్యవహారించింది కదా అంటూ బీఆర్‌ఎస్ సభ్యులకు డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.