- విజయవాడ జాతీయ రహదారిపై అంతరర్రాష్ట్ర గంజాయి సరఫరా ముఠాలు
- విద్యార్థులు, యువతే లక్ష్యంగా అమ్మకాలు
- కొనడానికి విక్రేతలుగా మారుతున్న వినియోగదారులు
- రాజస్థాన్, ఒడిశా రాష్ట్రాల నుంచి గంజాయి సరఫరా
ఎల్బీనగర్, ఫిబ్రవరి 11 : రాచకొండ పోలీస్ కమిషరేట్ పరిధి గంజాయి సరఫరాకు రాచమార్గంగా మారింది. ఇటీవల కాలంలో విజయవాడ జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలు నిర్వహిం చగా, భారీ స్థాయిలో గంజాయితోపాటు నిషేధిత డ్రగ్ ను స్వాధీనం చేసుకుని, సరఫరాల ముఠాలను అరెస్టు చేశారు. యువత క్రమేణా డ్రగ్స్, గంజాయికి ఆలవాటుపడుతున్నారు.
వీరు డ్రగ్స్ ను కొనడానికి, జల్సాలు చేయడానికి సుల భంగా డబ్బు సంపాధించడానికి డ్రగ్స్ బానిసలే డ్రగ్స్ విక్రేతలుగా మారుతున్నారు. ఇదీ అందోళన కలిగించే ప్రమాదకర విషయం. విజయవాడ జాతీయ రహదారిపై గంజాయి రవాణా జరుగుతున్నది. రాజ స్థాన్, మహరాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లో గంజాయిని సేకరించి, అక్కడి నుంచి పెద్ద అంబర్ పేట ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ఎల్బీనగర్ మీదుగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ఇటీవల పలు కేసుల్లో పట్టుపడినవారిలో వీరే అధికంగా ఉన్నారు. ఎక్కువగా ఎండు గంజాయి, హషిష్ అయిల్, ఎండీఎంఏ డ్రగ్స్, పెప్పర్ పౌడర్ ను రాచకొండ పోలీస్ కమిషరేట్ పరిధిలో పోలీసులు స్వాధీనం చేసుకు న్నారు. గంజాయిని ప్యాకెట్లుగా మార్చి, సరఫరాతోపాటు విక్రయిస్తున్నారు. పోలీసు లకు పట్టుపడినవారిలో విద్యార్థులు, యువత అధికంగా ఉన్నారు. వీరే సరఫరా దారులుగా, విక్రేతలుగా మారుతున్నారు.
ఎల్బీనగర్, వనస్థలిపురం, హయతనగర్, మహేశ్వరం ఎస్ వోటీ పోలీసులతోపాటు ఎక్సైజ్ పోలీసులు విసృత్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పోలీసుల నిఘా అధికం కావడంతో గంజాయి విక్రేతల ముఠాలు స్థబ్దుగా ఉన్నాయి. యువత మత్తుగా దూరంగా ఉండాలని పోలీసులు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు.
ఏడాది కాలంలో నమోదైన కేసులు
- ఏప్రిల్, మే, జూన్ నెలల కాలంలో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకుని 15 మందిపై కేసు నమోదు చేశారు. హయతనగర్ ఎక్సైజ్ సర్కిల్ పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. - ఏప్రిల్ లో నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరిని అరెస్టు చేసి, రెండు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.- జూన్ లో అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠాను అరెస్టు చేశారు.
వేర్వేరు ప్రాంతాల్లో ఎల్బీనగర్, వనస్థలిపురం, భువనగిరి ఎస్వోటీ పోలీసుల దాడులు చేపట్టి, మొత్తం ఆరుగురిని అరెస్టు చేశారు. దాడుల్లో 25 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్, 4 మొబైల్ ఫోన్లు, రూ. 4లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు - అనాజీపుర్ ఎక్స్ రోడ్డుపై ఇద్దరిని భువనగిరి ఎస్ వోటీ పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.
హషిష్ అయిల్ (2 లీటరు) స్వాధీనం చేసుకున్నారు. జూన్‌లో అంతర్రాష్ట్ర డ్రగ్స్ రాకెట్ అంతర్రాష్ట్ర ముఠాను చౌటుప్పల్, ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. పంతంగి టోల్ గేట్ వద్ద నిందితుల నుంచి 280కిలోల ఎండు గంజాయి, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. జూన్ 30న గంజాయి తరలిస్తూ కొందర పట్టుపడిన ఘటన నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది.
విజయవాడ నుంచి నిజామాబాద్ కు కారులో గ్యాస్ సిలిండర్ కు రంధ్రం చేసి, సుమారు 32 కిలోల గంజాయి పెట్టి తరలిస్తుండగా నాగోల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. - ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో 6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 10 మందిపై కేసులు నమోదు చేశారు. - తాజాగా హయత్ నగర్ ఎక్సైజ్ పరిధిలో ఒడిశా నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్న 14 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో లేడీ డాన్ సునీతా దాస్ తోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు.
డ్రగ్స్ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతాం..
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి, నిషేధిత డ్రగ్స్ రవాణాపై ఉక్కుపాదం మోపుతాం. యువత మత్తుకు దూరంగా ఉండాలి. ఎస్వోటీ పోలీసులు, స్థానిక పోలీసుల సాయంతో గంజాయి రవాణాపై నిఘా కట్టుదిట్టం చేశాం. సాంకేతిక పరిజ్ఞానంతో డ్రగ్స్ ముఠాల కదలికలు తెలుసుకుని, అరెస్ట్ చేస్తున్నాం. గంజాయి, డ్రగ్స్ సరఫరాపై ప్రజలు కూడా పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
ప్రవీణ్‌కుమార్, ఎల్బీనగర్ డీసీపీ