19-04-2025 07:34:36 PM
ఉమ్మడి జిల్లాలోనే అత్యుత్తమ ర్యాంకులు సాధించిన రేస్ ఐఐటి అకాడమీ...
రేస్ ఐఐటి మెడికల్ అకాడమీ చైర్మన్ బాణాల వసంతా రెడ్డి..
కోదాడ: జేఈఈ మెయిన్స్ ఆల్ ఇండియా ఓపెన్ క్యాటగిరిలో 2025 సెషన్-2 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శుక్రవారం విడుదల చేసింది. పర్సంటైలతో పాటు ర్యాంకులను ప్రకటించారు. ఈ ఫలితాలలో కోదాడ రేస్ ఐఐటి మెడికల్ అకాడమీ విద్యార్థులు జాతీయస్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. కళాశాలకు చెందిన ఎస్.డి హుజైఫా ఆల్ ఇండియా స్థాయిలో 3,469 వ ర్యాంకు, టి రోహిత్ రెడ్డి 4,160, ఎస్ దీక్షిత 4,635వ ర్యాంకు, పి సూర్యప్రకాష్ 6,253వ ర్యాంకు, సిహెచ్ కుషాల్ సాయి స్వరూప్ రెడ్డి 8,241 ర్యాంకు సాధించారు.
ఈ సందర్భంగా విద్యార్థులను చైర్మన్ బాణాల వసంత వెంకటరెడ్డి అభినందించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులను మెరుగుపరిచి వారి నుండి ఉన్నతమైన ర్యాంకులను సాధించడమే రేస్ కళాశాల లక్ష్యం అని పేర్కొన్నారు. విద్యా ప్రమాణలలో ఎక్కడ రాజీపడకుండా విద్యార్థులకు మంచి బోధనను అందించే ఉపాధ్యాయుల చేత విద్యను అందిస్తున్నామన్నారు. ఇదే లక్ష్యంతో భవిష్యత్తులో కూడా మరిన్ని ఉన్నతమైన ర్యాంకులు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మరియు అధ్యాపకులు పాల్గొన్నారు.