calender_icon.png 19 April, 2025 | 2:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుందేళ్ల దీవి

06-04-2025 12:00:00 AM

జపాన్‌లోని హిరోషిమా నగరానికి దగ్గర్లో ఒకునోషిమా అనే ఓ దీవి ఉంది. ఈ దీవిలో అడుగు పెడితే చాలు బోలెడన్ని కుందేళ్లు ఎదురుపడతాయి. అవి ఒకటో, రెండో కాదు.. వేల సంఖ్యలో ఉంటాయి. సాధారణంగా కుందేళ్లు మనల్ని చూడగానే దాక్కుంటాయి. కానీ ఇక్కడ అలా కాదు. మనం గింజలు, ధాన్యాలు వేస్తే.. గుంపులుగా, గెంతుతూ మన దగ్గరకి చేరుకుంటాయి. అందుకే దీనికి రాబిన్ ఐలాండ్ అనే పేరొచ్చింది. అయితే కొన్ని సంవత్సరాల క్రితం ఈ దీవి జనావాసంగానే ఉండేది.

కానీ అప్పుడే మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. దీంతో ఈ దీవి రక్షణ కోసం జపాన్ ప్రభుత్వం ఈ ప్రాంతంలో కొన్ని కోటలను నిర్మించింది. సైనిక బలగాలను కూడా మోహరించింది. యుద్ధం తర్వాత ఇక్కడున్న ప్రజలు, ఇతర ప్రాంతాలకు తరలించి, ఈ దీవినే పరిశోధన కేంద్రంగా మార్చుకుంది. ప్రయోగాల కోసం కొన్ని కుందేళ్లను తీసుకొచ్చింది. అప్పుడు అలా తీసుకొచ్చిన కుందేళ్లే ఇప్పుడిలా వృద్ధి చెందాయి. అవి పెరిగిపోయి ఈ దీవి కుందేళ్ల దీవిగా మారింది.