calender_icon.png 31 October, 2024 | 3:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నంబర్‌వన్ బౌలర్‌గా రబాడ

31-10-2024 12:43:50 AM

మూడో ర్యాంకుకు పడిపోయిన బుమ్రా

దుబాయ్: ఐసీసీ విడుదల చేసిన టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో సౌతాఫ్రికా స్టార్ బౌలర్ కగిసో రబాడ నంబర్‌వన్ స్థానం అధిరోహించాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఏడు వికెట్లు సాధించిన రబాడ టెస్టుల్లో 300 వికెట్ల మార్క్‌ను అందుకున్న రబాడ (860 పాయింట్లు) టాప్‌లో నిలిచాడు.

ఇప్పటివరకు నంబర్‌వన్‌గా కొనసాగిన టీమిండియా స్పీడస్టర్ జస్‌ప్రీత్ బుమ్రా రెండు స్థానాలు దిగజారి 846 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఆసీస్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ రెండో స్థానానికి ఎగబాకాడు. భారత సీనియర్ స్పిన్నర్ అశ్విన్ (831) రేటింగ్ పాయింట్లతో నాలుగో స్థానం నిలబెట్టుకున్నాడు.

ఆల్‌రౌండర్ల జాబితాలో మాత్రం రవీంద్ర జడేజా (434) రేటింగ్ పాయింట్లతో టాప్‌లో కొనసాగుతుండగా.. అశ్విన్ (315) రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. బ్యాటర్ల విషయానికి వస్తే టీమిండియా సంచలనం యశస్వి జైస్వాల్ (790) రేటింగ్ పాయింట్లతో టాప్-3లో ఉన్నాడు. భారత్ నుంచి టాప్-10లో యశస్వి మాత్రమే చోటు దక్కించుకున్నాడు.