హైదరాబాద్ : ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు ఆర్. నారాయణమూర్తి పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రి చేరారు. దీంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. దేవుడి దయవల్ల బాగానే కోటుకుంటున్నానని, ప్రస్తుతం తాను నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. పూర్తిగా కోలుకున్న తరువాత అన్ని వివరాలు వెల్లడిస్తానని నారాయణమూర్తి ఓ ప్రకటనలో తెలిపారు. సోషల్ మీడియాలో ఆయన ఆరోగ్యంపై చర్చ జరుగుతుండడంతో ఆయన ప్రటకన విడుదల చేశారు.