న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైన ముగ్గురు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య, సానా సతీష్ ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ నుంచి ఈనెల 13న రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో బీసీ హక్కుల కోసం పోరాడిన ఆర్ కృష్ణయ్య బీజేపీ నుంచి రాజ్యసభకు వెళ్లారు. 2014 లో టీడీటీ తరుపున ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గా గెలిచారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2022లో వైసీపీ నుంచి రాజ్యసభకు వెళ్లారు. ఈ ఏడాది సెప్టెంబర్ 24న రాజ్యసభకు, వైసీపీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆర్ కృష్ణయ్య బీజేపీ నుంచి పెద్దల సభకు వెళ్లారు. నెల్లూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త బీద మస్తాన్ రావు టీడీపీ నంచి రాజ్యసభకు వెళ్లారు. సానా సతీష్ టీడీపీ నుంచి పెద్దల సభలో నేడు ప్రమాణస్వీకారం చేశారు.