calender_icon.png 5 November, 2024 | 9:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు తెలిపిన ఆర్. కృష్ణయ్య

04-11-2024 04:44:37 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్ల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందుకోసం తక్షణమే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ నేపథ్యంలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్.కృష్ణయ్య, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఫిషర్ మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వి.కృష్ణమోహన్ రావు, బీసీ సంఘాలకు చెందిన ఇతర నేతలు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపారు.

న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు అమలయ్యేందుకు వీలుగా డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేసినందుకు  ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆర్.కృష్ణయ్య, బీసీ సంఘం నేతలు సీఎం రేవంత్ రెడ్డితో అన్నారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని సీఎం చెప్పారు. ఆ ప్రక్రియలోనే డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.