calender_icon.png 10 March, 2025 | 9:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలశక్తి ఆధ్వర్యంలో విద్యార్థులకు క్విజ్ పోటీలు

10-03-2025 06:58:36 PM

విద్యార్థులకు క్విజ్ పోటీలు..

నిర్మల్ (విజయక్రాంతి): జిల్లా యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బాలశక్తి కార్యక్రమంలో భాగంగా సోన్ మండలంలోని పాక్పట్ల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు క్విజ్ పోటీని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాల మేరకు ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు ఆరోగ్య, ఆర్థిక, సామాజిక సామర్థ్యాలు, నైపుణ్యాలు పెంపొందించేందుకు ఆర్థిక అక్షరాస్యత అనే అంశంపై విడ్స్ స్వచ్ఛంద సంస్థ క్విజ్ ను నిర్వహించింది. మొత్తం ఐదు జట్లు పాల్గొనగా ప్రథమ బహుమతి డి.అభిరామ్ గ్రూప్, ద్వితీయ బహుమతి కే.వశేఖర్ గ్రూప్ విజేతలుగా నిలిచారు.

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఎన్.వెంకన్న మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుండే పిల్లల్లో ఆర్థిక అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందని, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే తల్లిదండులకు డబ్బు యొక్క పొదుపు, పెట్టుబడి, దుబారా ఖర్చులు చేయకుండా ఆర్థిక క్రమశిక్షణను అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తోడిశెట్టి రవికాంత్, సంస్థ కౌన్సిలర్ భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.