21-03-2025 01:48:01 AM
ఎమ్మెల్యే అనిల్ జాదవ్
ఆదిలాబాద్ (విజయ క్రాంతి) : రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. అదేవిధంగా శనగల కొనుగోలులో ఎకరాకు 6.29 క్వింటాల్లే కాకుండా ఎకరాకు 12 క్వింటాళ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. బోథ్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారంఎమ్మెల్యే శనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
ముందుగా కాంటలకు ప్రత్యేక పూజలు చేసి, పంటను మార్కెట్ యార్డుకు తీసుకు వచ్చిన తొలి రైతుని శాలువాతో సత్కరించి కొనుగోలను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు దళారులకు నమ్మి మోసపోకుండా రైతులు తమ పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రలోనే అమ్మలని సూచించారు.
మార్కెట్ యార్డులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాటు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సంధ్యారాణి, మండల కన్వీనర్ నారాయణ రెడ్డి, మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, మాజీ మర్కెట్ కమిటి చైర్మన్ రుక్మాన్ సింగ్, మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్, రైతు బంధు సమితి మాజీ అధ్యక్షుడు బొడ్డు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.