calender_icon.png 12 December, 2024 | 12:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

180 క్వింటాళ్ల బియ్యం సీజ్

11-07-2024 12:29:29 AM

ఆదిలాబాద్/కామారెడ్డి, జూలై 10 (విజయక్రాంతి): వేర్వేరు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న 180 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యా న్ని పోలీసులు పట్టుకున్నారు. ఆదిలాబాద్ నుంచి మహారాష్ర్టకు తరలిస్తున్న వ్యాన్‌ను చందా(టీ) గ్రామ సమీపంలో పోలీసులు పట్టుకున్నారు. వాహనంలో 150 కింటాళ్ల రేషన్ బియ్యం సీజ్ చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సరంపల్లి వద్ద దేవునిపల్లి పోలీసులు  ఓ వాహనంలో ౩౦ క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నారు. కామారెడ్డి పట్ట ణానికి చెందిన బెజుగామ విజయ్‌కుమార్ సరంపల్లిలో రేషన్ బియ్యాన్ని సేకరించి కామారెడ్డికి తీసుకెళ్తుండగా పట్టుకున్నట్టు ఎస్సై రాజు తెలిపారు.