14-03-2025 12:00:00 AM
భీమదేవరపల్లి, మార్చి 13: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొ ప్పూరు శివారులోని గంగిరెద్దుల కాలనీలో బత్తుల రాజయ్య ఇంటి వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన 15 క్వింటాల్ల రేషన్ బియ్యాన్ని ముల్కనూర్ ఎస్త్స్ర సాయిబాబా పట్టుకున్నారు. రాజయ్య పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్త్స్ర వెల్లడించారు.