* కామారెడ్డి జిల్లా బిచ్కుందలో ఘటన
కామారెడ్డి, జనవరి 31 (విజయక్రాంతి): అక్రమంగా తరలిస్తున్న 10 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఘటన కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. బిచ్కుందకు చెందిన వాక్షోద్ సరిచంద్ ఆటోలో 25 సంచుల్లో రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా బిచ్కుంద ఎస్సై మోహ తన సిబ్బందితో పట్టుకున్నట్లు తెలిపారు.
రేషన్ బియ్యం స్వాధీనం చేసుకొని, సరిచంద్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. పట్టుబడిన బియ్యాన్ని రెవెన్యూ అధికా అప్పగించినట్లు పేర్కొన్నారు.